1 Chronicles · chapter 17 · verse 21
1 Chronicles 17:21 in Telugu
నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి
Nee janulaina ishraayeleeyulavanti janamu bhoolokamandu edi? Aiguptulonundi neevu vimochinchina nee janulayeduta niluvaneeyaka neevu aneka janamulanu tolivesinanduvalana neevu mahaa bhayankaramaina peru techchukontivi. Vaaru nee svanta janulagunatlu vaarini vimochinchutakai devudavaina neevu bayaluderitivi
1 Chronicles 17:21 in English
- King James Version (KJV)
- And what one nation in the earth [is] like thy people Israel, whom God went to redeem [to be] his own people, to make thee a name of greatness and terribleness, by driving out nations from before thy people, whom thou hast redeemed out of Egypt?
- World English Bible (WEB)
- What one nation on the earth is like your people Israel, whom God went to redeem to himself for a people, to make you a name by great and awesome things, in driving out nations from before your people whom you redeemed out of Egypt?
- American Standard Version (ASV)
- And what one nation in the earth is like thy people Israel, whom God went to redeem unto himself for a people, to make thee a name by great and terrible things, in driving out nations from before thy people, whom thou redeemedst out of Egypt?
- Bible in Basic English (BBE)
- And what other nation in the earth, like your people Israel, did a god go out to take for himself, to be his people, making his name great and to be feared, driving out the nations from before your people whom you made free and took out of Egypt?
- Darby Translation (DBY)
- And who is like thy people Israel, the one nation in the earth that God went to redeem to be a people to himself, to make thee a name of greatness and terribleness, by driving out nations from before thy people, which thou hast redeemed out of Egypt?
- Webster's Bible (WBS)
- And what one nation in the earth [is] like thy people Israel, whom God went to redeem [to be] his own people, to make thee a name of greatness and terribleness, by driving out nations from before thy people, whom thou hast redeemed out of Egypt?
- Young's Literal Translation (YLT)
- 'And who [is] as Thy people Israel, one nation in the earth whom God hath gone to ransom to Him for a people, to make for Thee a name great and fearful, to cast out from the presence of Thy people whom Thou hast ransomed out of Egypt — nations?
Read in context
- 19యెహోవా నీ దాసుని నిమి త్తమే నీ చిత్తప్రకారము ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు.
- 20యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.
- 21నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి
- 22నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి; యెహో వావైన నీవు వారికి దేవుడవై యున్నావు
- 23యెహోవా, ఇప్పుడు నీ దాసునిగూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక.
Cross references
- Ezekiel 20:9–10 యెహెజ్కేలు 20:9–10అయితే ఏ అన్య జనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి తిని. వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి అరణ్యము లోనికి తోడుకొని వచ్చి
- Exodus 19:4–6 నిర్గమకాండము 19:4–6నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు. సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా
- Deuteronomy 4:32–34 ద్వితీయోపదేశకాండము 4:32–34దేవుడు భూమిమీద నరుని సృజించిన దినము మొదలు కొని నీకంటె ముందుగానుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క యీ దిక్కునుండి ఆకాశముయొక్క ఆ దిక్కువరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహ త్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా?
- Psalm 147:20 కీర్తనలు 147:20ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.
- Psalm 65:5 కీర్తనలు 65:5మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతినిబట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చు చున్నావు
- Joshua 21:43–45 యెహోషువ 21:43–45యెహోవా ప్రమాణము చేసి వారి పితరుల కిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రా యేలీయుల కప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణముచేసిన వాటన్నిటి ప్రకారము అన్నిదిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరిని వారి చేతి కప్పగించియుండెను గనుక వారిలోనొకడును ఇశ్రాయేలీయులయెదుట నిలువ లేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.
- Isaiah 63:9 యెషయా 63:9వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.
- Isaiah 48:9 యెషయా 48:9నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ మునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను.
- Deuteronomy 33:26–29 ద్వితీయోపదేశకాండము 33:26–29యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
- Psalm 114:3–8 కీర్తనలు 114:3–8సముద్రము దానిని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను. కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి నది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించి నది? కొండలారా, మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము ఆయన బండను నీటిమడుగుగాను చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయువాడు.
- Psalm 111:9 కీర్తనలు 111:9ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.
- Isaiah 63:12 యెషయా 63:12తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?
Original words (Hebrew)
- one · H259אֶחָד ʼechâd
- nation · H1471גּוֹי gôwy
- earth · H776אֶרֶץ ʼerets
- people · H5971עַם ʻam
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- went · H1980הָלַךְ hâlak
- redeem · H6299פָּדָה pâdâh
- people · H5971עַם ʻam
- make · H7760שׂוּם sûwm
- name · H8034שֵׁם shêm
- greatness · H1420גְּדוּלָה gᵉdûwlâh
- terribleness · H3372יָרֵא yârêʼ
- out · H1644גָּרַשׁ gârash
- nations · H1471גּוֹי gôwy
- before · H6440פָּנִים pânîym
- people · H5971עַם ʻam
- redeemed · H6299פָּדָה pâdâh
- Egypt · H4714מִצְרַיִם Mitsrayim