1 Chronicles · chapter 17 · verse 20
1 Chronicles 17:20 in Telugu
యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.
Yehovaa, memu maa chevulato vininadantayu nijamu, neevanti vaadevadunu ledu, neevutappa mari e devudunu ledu.
1 Chronicles 17:20 in English
- King James Version (KJV)
- O LORD, [there is] none like thee, neither [is there any] God beside thee, according to all that we have heard with our ears.
- World English Bible (WEB)
- LORD, there is no one like you, neither is there any God besides you, according to all that we have heard with our ears.
- American Standard Version (ASV)
- O Jehovah, there is none like thee, neither is there any God besides thee, according to all that we have heard with our ears.
- Bible in Basic English (BBE)
- O Lord, there is no one like you, and no other God but you, as is clear from everything which has come to our ears.
- Darby Translation (DBY)
- Jehovah, there is none like thee, neither is there any God beside thee, according to all that we have heard with our ears.
- Webster's Bible (WBS)
- O LORD, [there] is none like thee, neither [is there any] God besides thee, according to all that we have heard with our ears.
- Young's Literal Translation (YLT)
- O Jehovah, there is none like Thee, and there is no god save Thee, according to all that we have heard with our ears.
Read in context
- 18నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడ నైన నేను నీతో మరి ఏమని మనవిచేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు.
- 19యెహోవా నీ దాసుని నిమి త్తమే నీ చిత్తప్రకారము ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు.
- 20యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.
- 21నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి
- 22నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి; యెహో వావైన నీవు వారికి దేవుడవై యున్నావు
Cross references
- Isaiah 44:6 యెషయా 44:6ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.
- Ephesians 3:20 ఎఫెసీయులకు 3:20మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,
- Exodus 15:11 నిర్గమకాండము 15:11యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు
- Jeremiah 10:6–7 యిర్మీయా 10:6–7యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘన మైనదాయెను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యము లన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము.
- Deuteronomy 3:24 ద్వితీయోపదేశకాండము 3:24ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవు డెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవు డెవడు?
- Psalm 78:3–4 కీర్తనలు 78:3–4మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.
- Deuteronomy 33:26 ద్వితీయోపదేశకాండము 33:26యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.
- Isaiah 43:10 యెషయా 43:10మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
- Isaiah 45:22 యెషయా 45:22భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
- 1 Samuel 2:2 1 సమూయేలు 2:2యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడుమన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు.
- Deuteronomy 4:39 ద్వితీయోపదేశకాండము 4:39కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము
- Psalm 89:6 కీర్తనలు 89:6మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?