1 Chronicles · chapter 5 · verse 11
1 Chronicles 5:11 in Telugu
గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.
Gaadu vanshasthulu vaarikedurugaa baashaanu deshamandu salkaavaraku kaapuramundiri.
1 Chronicles 5:11 in English
- King James Version (KJV)
- And the children of Gad dwelt over against them, in the land of Bashan unto Salchah:
- World English Bible (WEB)
- The sons of Gad lived beside them in the land of Bashan to Salecah:
- American Standard Version (ASV)
- And the sons of Gad dwelt over against them, in the land of Bashan unto Salecah:
- Bible in Basic English (BBE)
- And the sons of Gad were living opposite to them, in the land of Bashan as far as Salecah:
- Darby Translation (DBY)
- And the children of Gad dwelt over against them, in the land of Bashan, as far as Salcah:
- Webster's Bible (WBS)
- And the children of Gad dwelt over against them, in the land of Bashan to Salcah:
- Young's Literal Translation (YLT)
- And the sons of Gad, over-against them have dwelt in the land of Bashan unto Salcah,
Read in context
- 9వారి పశువులు గిలాదుదేశమందు అతివిస్తారము కాగా తూర్పున యూఫ్రటీసునది మొదలుకొని అరణ్యపు సరిహద్దువరకును వారు కాపురముండిరి.
- 10సౌలు దినములలో వారు హగ్రీ యీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.
- 11గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.
- 12వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.
- 13వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబయోరై యకాను జీయ ఏబెరు.
Cross references
- Joshua 13:11 యెహోషువ 13:11గిలాదును, గెషూరీ యులయొక్కయు మాయకాతీయులయొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కావరకు బాషాను దేశమంతయు
- Joshua 13:24–28 యెహోషువ 13:24–28మోషే గాదుగోత్రమునకు, అనగా గాదీయులకు వారి వంశములచొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును. వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్ట ణములును గ్రామములును ఇవి.
- Deuteronomy 3:10–17 ద్వితీయోపదేశకాండము 3:10–17మైదానమందలి పురములన్నిటిని బాషానునందలి ఓగు రాజ్యపురములైన సల్కా ఎద్రెయీ అనువాటివరకు గిలాదంతటిని బాషా నును పట్టుకొంటిమి. రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు. అర్నోను లోయలో నున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశ మును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఓగు రాజు దేశమైన బాషాను యావ త్తును గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంత టిని మనష్షే అర్ధ గోత్రమున కిచ్చితిని. మనష్షే కుమారు డైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయా కాతీయు యొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరీయులకు గిలాదు నిచ్చితిని. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీ యులకును గాదీయులకును ఇచ్చితిని.
- Numbers 32:34–36 సంఖ్యాకాండము 32:34–36గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టు కొనిరి.