1 Chronicles · chapter 9 · verse 29
1 Chronicles 9:29 in Telugu
మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరి శుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను.
Mariyu vaarilo kondaru migilina saamagrimeedanu pari shudhdhamaina paatralannitimeedanu unchabadiyundiri; sannapu pindiyu draakshaarasamunu nooneyu dhoopa vargamunu vaari adheenamu cheyabadenu.
1 Chronicles 9:29 in English
- King James Version (KJV)
- [Some] of them also [were] appointed to oversee the vessels, and all the instruments of the sanctuary, and the fine flour, and the wine, and the oil, and the frankincense, and the spices.
- World English Bible (WEB)
- Some of them also were appointed over the furniture, and over all the vessels of the sanctuary, over the fine flour, the wine, the oil, the frankincense, and the spices.
- American Standard Version (ASV)
- Some of them also were appointed over the furniture, and over all the vessels of the sanctuary, and over the fine flour, and the wine, and the oil, and the frankincense, and the spices.
- Bible in Basic English (BBE)
- And some of them were responsible for the holy things and for the vessels of the holy place, and the meal and the wine and the oil and the perfume and the spices.
- Darby Translation (DBY)
- [Part] of them also were appointed over the vessels, and over all the holy instruments, and over the fine flour, and the wine, and the oil, and the frankincense, and the spices.
- Webster's Bible (WBS)
- [Some] of them also [were] appointed to oversee the vessels, and all the instruments of the sanctuary, and the fine flour, and the wine, and the oil, and the frankincense, and the spices.
- Young's Literal Translation (YLT)
- And [some] of them are appointed over the vessels, even over all the vessels of the sanctuary, and over the fine flour, and the wine, and the oil, and the frankincense, and the spices.
Read in context
- 27వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపని వారిదే.
- 28వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టు వారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసికొని రావలెను.
- 29మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరి శుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను.
- 30యాజకుల కుమారు లలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయు దురు.
- 31లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండివంటల మీద నుంచబడెను.
Cross references
- 1 Chronicles 23:29 1 దినవృత్తాంతములు 23:29సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,
- Exodus 30:23–38 నిర్గమకాండము 30:23–38పరిశుద్ధ స్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతిపరి శుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులై యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింప వలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతోఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేకతైలమై యుండవలెను; దానిని నర శరీరము మీద పోయకూడదు; దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయ కూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠిత మైనదిగా నుండవలెను. దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము. దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారము లోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండ వలెను. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
- Exodus 27:20 నిర్గమకాండము 27:20మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము.