1 Chronicles · chapter 9 · verse 30
1 Chronicles 9:30 in Telugu
యాజకుల కుమారు లలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయు దురు.
Yaajakula kumaaru lalo kondaru sugandhavargamulanu parimalatailamunu cheyu duru.
1 Chronicles 9:30 in English
- King James Version (KJV)
- And [some] of the sons of the priests made the ointment of the spices.
- World English Bible (WEB)
- Some of the sons of the priests prepared the mixing of the spices.
- American Standard Version (ASV)
- And some of the sons of the priests prepared the confection of the spices.
- Bible in Basic English (BBE)
- And some of the sons of the priests were responsible for crushing the spices.
- Darby Translation (DBY)
- And it was [some one] of the sons of the priests who compounded the ointment of the spices.
- Webster's Bible (WBS)
- And [some] of the sons of the priests made the ointment of the spices.
- Young's Literal Translation (YLT)
- And [some] of the sons of the priests are mixing the mixture for spices.
Read in context
- 28వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టు వారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసికొని రావలెను.
- 29మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరి శుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను.
- 30యాజకుల కుమారు లలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయు దురు.
- 31లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండివంటల మీద నుంచబడెను.
- 32వారి సహోదరులగు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగియుండెను.
Cross references
- Exodus 30:23–25 నిర్గమకాండము 30:23–25పరిశుద్ధ స్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
- Exodus 37:29 నిర్గమకాండము 37:29అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.
- Exodus 30:33 నిర్గమకాండము 30:33దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.
- Exodus 30:35–38 నిర్గమకాండము 30:35–38వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము. దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారము లోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండ వలెను. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.