1 Chronicles · chapter 9 · verse 34
1 Chronicles 9:34 in Telugu
వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.
Veeru tama vanshapatteela choppuna leveeyula pitarulalo peddalainavaaru. Veeru yerooshalemunandu kaapuramundiri.
1 Chronicles 9:34 in English
- King James Version (KJV)
- These chief fathers of the Levites [were] chief throughout their generations; these dwelt at Jerusalem.
- World English Bible (WEB)
- These were heads of fathers’ households of the Levites, throughout their generations, chief men. They lived at Jerusalem.
- American Standard Version (ASV)
- These were heads of fathers’ [houses] of the Levites, throughout their generations, chief men: these dwelt at Jerusalem.
- Bible in Basic English (BBE)
- These were heads of families of the Levites in their generations, chief men; they were living at Jerusalem.
- Darby Translation (DBY)
- These are the chief fathers of the Levites, heads according to their families; these dwelt in Jerusalem.
- Webster's Bible (WBS)
- These chief fathers of the Levites [were] chief throughout their generations; these dwelt at Jerusalem.
- Young's Literal Translation (YLT)
- These heads of the fathers of the Levites throughout their generations [are] heads. These have dwelt in Jerusalem.
Read in context
- 32వారి సహోదరులగు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగియుండెను.
- 33లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగియున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.
- 34వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైనవారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి.
- 35గిబియోను తండ్రి యైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.
- 36ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు
Cross references
- Nehemiah 11:1–15 నెహెమ్యా 11:1–15జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధపట్టణమగు యెరూష లేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పు కొనినవారిని జనులు దీవించిరి. యెరూష లేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదాపట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివ సించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజ కులును లేవీయులును నెతీనీయులును సొలొమోనుయొక్క దాసుల వంశస్థులును నివాసము చేసిరి. మరియు యెరూష లేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన నాలుగువందల అరువది ఎనమండుగురు. బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు. అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమ్మిదివందల ఇరువది యెనమండుగురు; జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణముమీద రెండవ అధికారియై యుండెను. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదా యాయు యాకీనును శెరాయా దేవుని మందిరమునకు అధిపతియై యుండెను. ఇతడు మషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీ యాకు పుట్టెను. ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయా పషూరు జెకర్యా అవీ్జు పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు రెండువందల నలువది యిద్దరు. మరియు ఇమ్మేరు మెషిల్లేమోతె అహజైయను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి. బల వంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీయులలో ఎవరనగా, షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యాకనిన అజ్రీకాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు.
- 1 Chronicles 9:13 1 దినవృత్తాంతములు 9:13మరియు తమ పితరుల యిండ్లకు పెద్దలైన వెయ్యిన్ని యేడువందల అరువది మంది కుటుంబికులు. వీరు దేవుని మందిరసేవా సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు.