1 Corinthians · chapter 10 · verse 7
1 Corinthians 10:7 in Telugu
జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.
Janulu tinutakunu traagutakunu koorchundi, aadutaku lechiri. Ani vraayabadinatlu vaarilo kondarivale meeru vigrahaaraadhakulai yundakudi.
1 Corinthians 10:7 in English
- King James Version (KJV)
- Neither be ye idolaters, as [were] some of them; as it is written, The people sat down to eat and drink, and rose up to play.
- World English Bible (WEB)
- Don’t be idolaters, as some of them were. As it is written, “The people sat down to eat and drink, and rose up to play.”
- American Standard Version (ASV)
- Neither be ye idolaters, as were some of them; as it is written, The people sat down to eat and drink, and rose up to play.
- Bible in Basic English (BBE)
- Then do not go after false gods, as some of them did; as it is said in the holy Writings, After resting and feasting, the people got up to take their pleasure.
- Darby Translation (DBY)
- Neither be ye idolaters, as some of them; as it is written, The people sat down to eat and to drink, and rose up to play.
- Webster's Bible (WBS)
- Neither be ye idolaters, as [were] some of them: as it is written, The people sat down to eat and drink, and rose up to play.
- Young's Literal Translation (YLT)
- Neither become ye idolaters, as certain of them, as it hath been written, 'The people sat down to eat and to drink, and stood up to play;'
Read in context
- 5అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.
- 6వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.
- 7జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.
- 8మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.
- 9మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.
Cross references
- Exodus 32:6–8 నిర్గమకాండము 32:6–8మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించిఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.
- Psalm 106:19–20 కీర్తనలు 106:19–20హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపము నకు మార్చిరి.
- 1 Corinthians 6:9 1 కొరింథీయులకు 6:9అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను
- Deuteronomy 9:12 ద్వితీయోపదేశకాండము 9:12నీవు లేచి యిక్కడ నుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులోనుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారి కాజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను.
- 1 Corinthians 10:14 1 కొరింథీయులకు 10:14కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూర ముగా పారిపొండి.
- Deuteronomy 9:16–21 ద్వితీయోపదేశకాండము 9:16–21నేను చూచి నప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసియుంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకాజ్ఞాపించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి యుంటిరి. అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టు కొని, నా రెండు చేతులలోనుండి మీకన్నుల యెదుట వాటిని క్రిందపడవేసి పగులగొట్టి మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యెహోవా కోపో ద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతనిమీద బహుగా కోప పడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని.
- 1 Corinthians 5:11 1 కొరింథీయులకు 5:11ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.
- Exodus 32:19 నిర్గమకాండము 32:19అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తన చేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను.
- 1 John 5:21 1 యోహాను 5:21చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.
- Exodus 32:17 నిర్గమకాండము 32:17ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని వినిపాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా
- Exodus 32:4 నిర్గమకాండము 32:4అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారుఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.
- 1 Corinthians 14:20–22 1 కొరింథీయులకు 14:20–22సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి. అన్య భాషలు మాటలాడు జనులద్వారాను, పరజనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయ బడియున్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై యున్నది.
Original words (Greek)
- Neither · G3366μηδέ mēdé
- ye · G1096γίνομαι gínomai
- idolaters · G1496εἰδωλολάτρης eidōlolátrēs
- as · G2531καθώς kathṓs
- some · G5100τὶς tìs
- them · G846αὐτός autós
- as · G5613ὡς hōs
- written · G1125γράφω gráphō
- people · G2992λαός laós
- down · G2523καθίζω kathízō
- eat · G5315φάγω phágō
- and · G2532καί kaí
- drink · G4095πίνω pínō
- and · G2532καί kaí
- up · G450ἀνίστημι anístēmi
- play · G3815παίζω paízō