1 Corinthians · chapter 15 · verse 4
1 Corinthians 15:4 in Telugu
లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.
Lekhanamula prakaaramu moodavadinamuna lepabadenu.
1 Corinthians 15:4 in English
- King James Version (KJV)
- And that he was buried, and that he rose again the third day according to the scriptures:
- World English Bible (WEB)
- that he was buried, that he was raised on the third day according to the Scriptures,
- American Standard Version (ASV)
- and that he was buried; and that he hath been raised on the third day according to the scriptures;
- Bible in Basic English (BBE)
- And he was put in the place of the dead; and on the third day he came back from the dead, as it says in the Writings;
- Darby Translation (DBY)
- and that he was buried; and that he was raised the third day, according to the scriptures;
- Webster's Bible (WBS)
- And that he was buried, and that he rose again the third day according to the scriptures:
- Young's Literal Translation (YLT)
- and that he was buried, and that he hath risen on the third day, according to the Writings,
Read in context
- 2మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.
- 3నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,
- 4లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.
- 5ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.
- 6అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.
Cross references
- Hosea 6:2 హోషేయ 6:2రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును.
- Matthew 12:40 మత్తయి 12:40యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.
- Psalm 16:10–11 కీర్తనలు 16:10–11ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.
- Isaiah 53:9–12 యెషయా 53:9–12అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను
- Acts 26:22–23 అపొస్తలుల కార్యములు 26:22–23అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పు లకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.
- Acts 13:29–37 అపొస్తలుల కార్యములు 13:29–37వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను. ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు. దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది. మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టిదావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తనయందునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యౌవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.
- Luke 24:46 లూకా 24:46క్రీస్తు శ్రమపడి మూడవ దిన మున మృతులలోనుండి లేచుననియు
- Jonah 1:17 యోనా 1:17గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను.
- Psalm 2:7 కీర్తనలు 2:7కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.
- 1 Corinthians 15:16–21 1 కొరింథీయులకు 15:16–21మృతులు లేపబడని యెడల క్రీస్తుకూడ లేపబడలేదు. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యు లందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము. ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.
- Hebrews 13:20 హెబ్రీయులకు 13:20గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,
- Acts 2:23–33 అపొస్తలుల కార్యములు 2:23–33దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను; అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరెగి, క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు.