1 Corinthians · chapter 7 · verse 19
1 Corinthians 7:19 in Telugu
దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.
Devuni aajnyalanu anusarinchutaye mukhyamu gaani sunnati pondutayandu emiyu ledu, sunnati pondaka povutayandu emiyuledu.
1 Corinthians 7:19 in English
- King James Version (KJV)
- Circumcision is nothing, and uncircumcision is nothing, but the keeping of the commandments of God.
- World English Bible (WEB)
- Circumcision is nothing, and uncircumcision is nothing, but what matters is keeping God’s commandments.
- American Standard Version (ASV)
- Circumcision is nothing, and uncircumcision is nothing; but the keeping of the commandments of God.
- Bible in Basic English (BBE)
- Circumcision is nothing, and its opposite is nothing, but only doing the orders of God is of value.
- Darby Translation (DBY)
- Circumcision is nothing, and uncircumcision is nothing; but keeping God's commandments.
- Webster's Bible (WBS)
- Circumcision is nothing, and uncircumcision is nothing, but the keeping of the commandments of God.
- Young's Literal Translation (YLT)
- the circumcision is nothing, and the uncircumcision is nothing — but a keeping of the commands of God.
Read in context
- 17అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.
- 18సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.
- 19దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.
- 20ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను.
- 21దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది.
Cross references
- Galatians 5:6 గలతీయులకు 5:6యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.
- Galatians 6:15 గలతీయులకు 6:15క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు.
- 1 John 2:3–4 1 యోహాను 2:3–4మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.
- Romans 2:25–29 రోమీయులకు 2:25–29నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మ శాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మ శాస్త్రపు నీతి విధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా? మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.
- 1 John 3:22–24 1 యోహాను 3:22–24ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింప వలెననునదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొను చున్నాము.
- Colossians 3:11 కొలొస్సయులకు 3:11ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.
- Revelation 22:14 ప్రకటన 22:14జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.
- 1 Corinthians 8:8 1 కొరింథీయులకు 8:8భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.
- Jeremiah 7:22–23 యిర్మీయా 7:22–23నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.
- Matthew 5:19 మత్తయి 5:19కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.
- Romans 3:30 రోమీయులకు 3:30దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.
- Galatians 3:28 గలతీయులకు 3:28ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.