1 Kings · chapter 10 · verse 11
1 Kings 10:11 in Telugu
మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను.
Mariyu opheeru deshamunundi bangaaramu techchina heeraamu odalu opheerunundi chandanapu mraanulanu ratnamulanu bahu vistaaramugaa techchenu.
1 Kings 10:11 in English
- King James Version (KJV)
- And the navy also of Hiram, that brought gold from Ophir, brought in from Ophir great plenty of almug trees, and precious stones.
- World English Bible (WEB)
- The fleet of Hiram that brought gold from Ophir also brought in from Ophir great quantities of almug trees and precious stones.
- American Standard Version (ASV)
- And the navy also of Hiram, that brought gold from Ophir, brought in from Ophir great plenty of almug-trees and precious stones.
- Bible in Basic English (BBE)
- And the sea-force of Hiram, in addition to gold from Ophir, came back with much sandal-wood and jewels.
- Darby Translation (DBY)
- (And the fleet also of Hiram, which carried gold from Ophir, brought from Ophir sandal-wood in very great abundance, and precious stones.
- Webster's Bible (WBS)
- And the navy also of Hiram, that brought gold from Ophir, brought in from Ophir great plenty of almug trees, and precious stones.
- Young's Literal Translation (YLT)
- And also, the navy of Hiram that bore gold from Ophir, brought in from Ophir almug-trees very many, and precious stone;
Read in context
- 9నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రా యేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగిం చుటకు ఆయన నిన్ను నియమించెను అనెను.
- 10మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగార మును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు.
- 11మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను.
- 12ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు.
- 13సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినదిపోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశ మునకు తిరిగి వెళ్లిరి.
Cross references
- 1 Kings 9:27–28 1 రాజులు 9:27–28సొలొమోను సేవకులతో కూడ హీరాము సముద్రప్రయాణముచేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను. వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.
- 2 Chronicles 2:8 2 దినవృత్తాంతములు 2:8మరియు లెబానోనునందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసేయున్నది.
- 2 Chronicles 8:18 2 దినవృత్తాంతములు 8:18హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమ్మిదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.
- 2 Chronicles 9:10–11 2 దినవృత్తాంతములు 9:10–11ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములనుకూడ కొనివచ్చిరి. ఆ చంద నపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సౌపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు.
- Psalm 45:9 కీర్తనలు 45:9నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.
Original words (Hebrew)
- navy · H590אֳנִי ʼŏnîy
- Hiram · H2438חִירָם Chîyrâm
- brought · H5375נָשָׂא nâsâʼ
- gold · H2091זָהָב zâhâb
- Ophir · H211אוֹפִיר ʼÔwphîyr
- in · H935בּוֹא bôwʼ
- Ophir · H211אוֹפִיר ʼÔwphîyr
- great · H3966מְאֹד mᵉʼôd
- plenty · H7235רָבָה râbâh
- almug · H484אַלְמֻגִּים ʼalmuggîym
- trees · H6086עֵץ ʻêts
- precious · H3368יָקָר yâqâr
- stones · H68אֶבֶן ʼeben