1 Kings · chapter 11 · verse 8
1 Kings 11:8 in Telugu
తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.
Tama devatalaku dhoopamu veyuchu balula narpinchuchundina parastreelaina tana bhaaryala nimittamu atadu eelaagu chesenu.
1 Kings 11:8 in English
- King James Version (KJV)
- And likewise did he for all his strange wives, which burnt incense and sacrificed unto their gods.
- World English Bible (WEB)
- So he did for all his foreign wives, who burned incense and sacrificed to their gods.
- American Standard Version (ASV)
- And so did he for all his foreign wives, who burnt incense and sacrificed unto their gods.
- Bible in Basic English (BBE)
- And so he did for all his strange wives, who made offerings with burning of perfumes to their gods.
- Darby Translation (DBY)
- And so he did for all his foreign wives, who burned incense and sacrificed to their gods.
- Webster's Bible (WBS)
- And likewise did he for all his foreign wives, who burnt incense and sacrificed to their gods.
- Young's Literal Translation (YLT)
- and so he hath done for all his strange women, who are perfuming and sacrificing to their gods.
Read in context
- 6ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.
- 7సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.
- 8తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.
- 9ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై
- 10నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి
Cross references
- 1 Kings 11:1 1 రాజులు 11:1మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయ ములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీ యులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి
- 1 Corinthians 10:20–22 1 కొరింథీయులకు 10:20–22లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?
- 1 Corinthians 10:11–12 1 కొరింథీయులకు 10:11–12ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
- Hosea 4:11–12 హోషేయ 4:11–12వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానము చేతను వారు మతిచెడిరి. నా జనులు తాము పెట్టు కొనిన కఱ్ఱయొద్ద విచారణచేయుదురు, తమ చేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు.
- Ezekiel 16:22–29 యెహెజ్కేలు 16:22–29నీ బాల్య కాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగానుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చు కొనక ఇన్ని హేయక్రియలను ఇంక జారత్వమును చేయుచు వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించి నందుకు నీకు శ్రమ నీకు శ్రమ; యిదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలి పీఠములను ఏర్పరచితివి, ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించి యున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వక్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువచేసి, నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించు చున్నాను. అంతటితో తృప్తినొందక అష్షూరువారి తోను నీవు వ్యభిచరించితివి, వారితోకూడి జారత్వము చేసినను తృప్తినొందకపోతివి. కనాను దేశము మొదలు కొని కల్దీయదేశమువరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తినొందలేదు.