1 Kings · chapter 14 · verse 3
1 Kings 14:3 in Telugu
కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డితేనెయు చేత పట్టుకొని అతని దర్శించుము. బిడ్డయేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా
Kaabatti neevu padi rottelunu appamulunu oka budditeneyu cheta pattukoni atani darshinchumu. Biddayemaguno atadu neeku teliyajeyunani cheppagaa
1 Kings 14:3 in English
- King James Version (KJV)
- And take with thee ten loaves, and cracknels, and a cruse of honey, and go to him: he shall tell thee what shall become of the child.
- World English Bible (WEB)
- Take with you ten loaves of bread, some cakes, and a jar of honey, and go to him. He will tell you what will become of the child.”
- American Standard Version (ASV)
- And take with thee ten loaves, and cakes, and a cruse of honey, and go to him: he will tell thee what shall become of the child.
- Bible in Basic English (BBE)
- And take with you ten cakes of bread and dry cakes and a pot of honey, and go to him: he will give you word of what is to become of the child.
- Darby Translation (DBY)
- And take with thee ten loaves, and cakes, and a cruse of honey, and go to him: he will tell thee what shall become of the lad.
- Webster's Bible (WBS)
- And take with thee ten loaves, and cracknels, and a cruse of honey, and go to him: he will tell thee what shall become of the child.
- Young's Literal Translation (YLT)
- and thou hast taken in thy hand ten loaves, and crumbs, and a bottle of honey, and hast gone in unto him; he doth declare to thee what becometh of the youth.'
Read in context
- 1ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలాపడగా
- 2యరొబాము తన భార్యతో ఇట్లనెనునీవు లేచి యరొబాము భార్యౌవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియ జెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.
- 3కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డితేనెయు చేత పట్టుకొని అతని దర్శించుము. బిడ్డయేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా
- 4యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా యింటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యముచేత కండ్లు కానరాని వాడై యుండెను.
- 5అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగాయరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతనిగూర్చి నీచేత విచా రించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది ఆమె మారువేషము వేసికొని మరియొకతెయైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్టు నీవు ఆమెతో చెప్పవలెను.
Cross references
- 1 Samuel 9:7–8 1 సమూయేలు 9:7–8అందుకు సౌలుమనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొని పోవు దుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరి పోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసి కొనిపోవుటకు మన కేమియు లేదు అని తన పనివానితో చెప్పిమనయొద్ద ఏమి యున్నదని అడుగగా వాడు సౌలుతోచిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తుననెను.
- 1 Kings 13:7 1 రాజులు 13:7అప్పుడు రాజునీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా
- 2 Kings 4:42 2 రాజులు 4:42మరియు ఒకడు బయల్షాలిషానుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన యిరువది రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను.
- John 11:3 యోహాను 11:3అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.
- 2 Kings 5:15 2 రాజులు 5:15అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచిచిత్త గించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోక మంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగు దును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహు మానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా
- John 4:47–48 యోహాను 4:47–48యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను. యేసుసూచక క్రియలను మహత్కార్యములను చూడ కుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను.
- Luke 7:2–3 లూకా 7:2–3ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను. శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను.
- 2 Kings 8:7–9 2 రాజులు 8:7–9ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగియై యుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని హజాయేలును పిలిచినీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొన బోయిఈ రోగముపోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవాయొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను. కాబట్టి హజా యేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొన బోయి అతని ముందర నిలిచినీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదునాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను.
- 2 Kings 5:5 2 రాజులు 5:5సిరియా రాజునేను ఇశ్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొని పోయి ఇశ్రా యేలురాజునకు పత్రికను అప్పగించెను.
- 2 Kings 1:2 2 రాజులు 1:2అహజ్యా షోమ్రో నులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియైమీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయిఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థ పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా