John · chapter 11 · verse 3
John 11:3 in Telugu
అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.
Atani akka chellendru prabhuvaa, yidigo neevu preminchuvaadu rogiyai yunnaadani aayanayoddaku vartamaanamu pampiri.
John 11:3 in English
- King James Version (KJV)
- Therefore his sisters sent unto him, saying, Lord, behold, he whom thou lovest is sick.
- World English Bible (WEB)
- The sisters therefore sent to him, saying, “Lord, behold, he for whom you have great affection is sick.”
- American Standard Version (ASV)
- The sisters therefore sent unto him, saying, Lord, behold, he whom thou lovest is sick.
- Bible in Basic English (BBE)
- So the sisters sent to him, saying, Lord, your dear friend is ill.
- Darby Translation (DBY)
- The sisters therefore sent to him, saying, Lord, behold, he whom thou lovest is sick.
- Webster's Bible (WBS)
- Therefore his sisters sent to him, saying, Lord, behold, he whom thou lovest is sick.
- Young's Literal Translation (YLT)
- therefore sent the sisters unto him, saying, 'Sir, lo, he whom thou dost love is ailing;'
Read in context
- 1మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.
- 2ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.
- 3అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.
- 4యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.
- 5యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.
Cross references
- John 11:5 యోహాను 11:5యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.
- Revelation 3:19 ప్రకటన 3:19నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
- Hebrews 12:6–7 హెబ్రీయులకు 12:6–7ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
- Psalm 16:3 కీర్తనలు 16:3నేనీలాగందును భూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు.
- John 13:23 యోహాను 13:23ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను
- John 11:36 యోహాను 11:36కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.
- 2 Timothy 4:20 2 తిమోతికి 4:20ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చి తిని.
- John 11:11 యోహాను 11:11ఆయన యీ మాటలు చెప్పిన తరువాతమన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా
- Genesis 22:2 ఆదికాండము 22:2అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను
- Philippians 2:26–27 ఫిలిప్పీయులకు 2:26–27అతడురోగి యాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమై యుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతనిమాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను.
- James 5:14–15 యాకోబు 5:14–15మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.
- John 11:1 యోహాను 11:1మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.