1 Kings · chapter 14 · verse 1
1 Kings 14:1 in Telugu
ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలాపడగా
Aa kaalamuna yarobaamu kumaarudaina abeeyaa kaayilaapadagaa
1 Kings 14:1 in English
- King James Version (KJV)
- At that time Abijah the son of Jeroboam fell sick.
- World English Bible (WEB)
- At that time Abijah the son of Jeroboam became sick.
- American Standard Version (ASV)
- At that time Abijah the son of Jeroboam fell sick.
- Bible in Basic English (BBE)
- At that time Abijah, the son of Jeroboam, became ill.
- Darby Translation (DBY)
- At that time Abijah the son of Jeroboam was sick.
- Webster's Bible (WBS)
- At that time Abijah the son of Jeroboam fell sick.
- Young's Literal Translation (YLT)
- At that time was Abijah son of Jeroboam sick,
Read in context
- 1ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలాపడగా
- 2యరొబాము తన భార్యతో ఇట్లనెనునీవు లేచి యరొబాము భార్యౌవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియ జెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.
- 3కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డితేనెయు చేత పట్టుకొని అతని దర్శించుము. బిడ్డయేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా
Cross references
- 1 Kings 13:33–34 1 రాజులు 13:33–34ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గ మును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యరొబాముసంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.
- 1 Samuel 31:2 1 సమూయేలు 31:2సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.
- 1 Kings 14:12–13 1 రాజులు 14:12–13కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చని పోవును; అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.
- 2 Samuel 12:15 2 సమూయేలు 12:15గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.
- Exodus 20:5 నిర్గమకాండము 20:5ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
- 1 Samuel 4:19–20 1 సమూయేలు 4:19–20ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులుతగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను. ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతోభయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై