1 Kings · chapter 7 · verse 45
1 Kings 7:45 in Telugu
బిందెలను, చేటలను, గిన్నెలను వీటినన్నిటిని రాజైనసొలొమోను ఆజ్ఞనుబట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన యిత్తడివై యుండెను.
Bindelanu, chetalanu, ginnelanu veetinannitini raajainasolomonu aajnyanubatti heeraamu yehovaa mandiramunaku chesenu. Ee vastuvulanniyu merugupettina yittadivai yundenu.
1 Kings 7:45 in English
- King James Version (KJV)
- And the pots, and the shovels, and the basons: and all these vessels, which Hiram made to king Solomon for the house of the LORD, [were of] bright brass.
- World English Bible (WEB)
- the pots; the shovels; and the basins. All of these vessels, which Hiram made for King Solomon for the LORD’s house, were of burnished bronze.
- American Standard Version (ASV)
- and the pots, and the shovels, and the basins: even all these vessels, which Hiram made for king Solomon, in the house of Jehovah, were of burnished brass.
- Bible in Basic English (BBE)
- And the pots and the spades and the basins; all the vessels which Hiram made for King Solomon, for the house of the Lord, were of polished brass.
- Darby Translation (DBY)
- and the pots, and the shovels, and the bowls. And all these things, which Hiram made king Solomon for the house of Jehovah, were of bright brass.
- Webster's Bible (WBS)
- And the pots, and the shovels, and the basins: and all these vessels which Hiram made to king Solomon for the house of the LORD, [were of] bright brass.
- Young's Literal Translation (YLT)
- and the pots, and the shovels, and the bowls; and all these vessels, that Hiram hath made to king Solomon [for] the house of Jehovah, [are] of brass — polished.
Read in context
- 43పది స్తంభ ములను, స్తంభములమీద పది తొట్లను,
- 44ఒక సముద్ర మును, సముద్రముక్రింద పండ్రెండు ఎడ్లను,
- 45బిందెలను, చేటలను, గిన్నెలను వీటినన్నిటిని రాజైనసొలొమోను ఆజ్ఞనుబట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన యిత్తడివై యుండెను.
- 46యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతాను నకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోత పోయించెను.
- 47అయితే ఈ ఉపకరణములు అతివిస్తారము లైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను;ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.
Cross references
- Exodus 27:3 నిర్గమకాండము 27:3దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను.
- Exodus 38:3 నిర్గమకాండము 38:3అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్ని టిని, అనగా దాని బిందెలను దాని గరిటె లను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను
- 2 Chronicles 4:16 2 దినవృత్తాంతములు 4:16పాత్రలు, బూడిదె నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణ ములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను.
- 1 Samuel 2:13–14 1 సమూయేలు 2:13–14జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి బొరుసులో గాని తపేలలోగాని గూనలోగాని కుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి.
- Ezekiel 46:20–24 యెహెజ్కేలు 46:20–24ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణములోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే యని నాతోచెప్పి అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనివచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణముయొక్క మూలమూలను మరియొక ఆవరణమున్నట్టు కనబడెను. ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడెను. ఒక్కొక్కటి నలువది మూరల నిడివియు ముప్పది మూరల వెడల్పును గలిగి నాలుగును ఏకపరిమాణముగా ఉండెను. మరియు ఆ నాలుగింటిలోను చుట్టు పంక్తిగానున్న అటకలుండెను, చుట్టునున్న అటకల క్రింద పొయిలుండెను. ఇది వంటచేయువారి స్థలము, ఇక్కడ మందిరపరిచారకులు జనులు తెచ్చు బలిపశుమాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను.
- Leviticus 8:31 లేవీయకాండము 8:31అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారుల తోను ఇట్లనెనుప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారు లును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠితద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను.
- Zechariah 14:21 జెకర్యా 14:21యెరూషలేమునందును యూదాదేశమందును ఉన్న పాత్రలన్నియు సైన్యములకు అధిపతియగు యెహో వాకు ప్రతిష్టితములగును; బలిపశువులను వధించువారంద రును వాటిలో కావలసినవాటిని తీసికొని వాటిలో వండు కొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు.