1 Kings · chapter 8 · verse 16
1 Kings 8:16 in Telugu
నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండు నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములో నైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెల విచ్చెను.
Nenu ishraayeleeyulagu naa janulanu aiguptulonundi rappinchina naatanundi naa naamamu daaniyandundu natlugaa ishraayeleeyula gotrasthaanamulalo e pattanamulo nainanu mandiramunu kattinchutaku nenu koraledu gaani ishraayeleeyulagu naa janulameeda daaveedunu unchutaku nenu koriyunnaanu ani aayana sela vichchenu.
1 Kings 8:16 in English
- King James Version (KJV)
- Since the day that I brought forth my people Israel out of Egypt, I chose no city out of all the tribes of Israel to build an house, that my name might be therein; but I chose David to be over my people Israel.
- World English Bible (WEB)
- ‘Since the day that I brought my people Israel out of Egypt, I chose no city out of all the tribes of Israel to build a house, that my name might be there; but I chose David to be over my people Israel.’
- American Standard Version (ASV)
- Since the day that I brought forth my people Israel out of Egypt, I chose no city out of all the tribes of Israel to build a house, that my name might be there; but I chose David to be over my people Israel.
- Bible in Basic English (BBE)
- From the day when I took my people Israel out of Egypt, no town in all the tribes of Israel has been marked out by me for the building of a house for the resting-place of my name; but I made selection of David to be king over my people Israel.
- Darby Translation (DBY)
- Since the day that I brought forth my people Israel out of Egypt, I chose no city out of all the tribes of Israel to build a house in, that my name might be there; but I have chosen David to be over my people Israel.
- Webster's Bible (WBS)
- Since the day that I brought forth my people Israel from Egypt, I have chosen no city out of all the tribes of Israel to build a house, that my name might be therein; but I chose David to be over my people Israel.
- Young's Literal Translation (YLT)
- From the day that I brought out My people, even Israel, from Egypt, I have not fixed on a city out of all the tribes of Israel, to build a house for My name being there; and I fix on David to be over My people Israel.
Read in context
- 14ముఖమును ప్రజలతట్టు త్రిప్పుకొని, ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచియుండగా ఇశ్రాయేలీయుల సమాజకులందరిని ఈలాగు దీవించెను.
- 15నా తండ్రియైన దావీదు నకు మాట యిచ్చి దాని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక.
- 16నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండు నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములో నైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెల విచ్చెను.
- 17ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవ లెనని నా తండ్రియైన దావీదునకు మనస్సు పుట్టగా
- 18యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగానా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి యున్నావు, ఆ తాత్పర్యము మంచిదే;
Cross references
- 1 Samuel 16:1 1 సమూయేలు 16:1అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెల విచ్చెనుఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖిం తువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
- 2 Samuel 7:4–8 2 సమూయేలు 7:4–8అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుముయెహోవా నీకాజ్ఞ ఇచ్చునదేమనగానాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులోనుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాల మంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవ దారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించి తిని.
- 1 Kings 8:29 1 రాజులు 8:29నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీ కరించునట్లునా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక.
- Deuteronomy 12:11 ద్వితీయోపదేశకాండము 12:11నేను మికాజ్ఞా పించు సమస్త మును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కు బళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థల మునకే మీరు తీసికొని రావలెను.
- 1 Chronicles 28:4 1 దినవృత్తాంతములు 28:4ఇశ్రాయేలీయులమీద నిత్యము రాజునై యుండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి యింటివారందరిలోను నన్ను కోరుకొనెను, ఆయన యూదాగోత్రమును, యూదాగోత్రపువారిలో ప్రధానమైనదిగా నా తండ్రి యింటిని నా తండ్రి యింటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించియున్నాడు.
- 1 Chronicles 17:5–6 1 దినవృత్తాంతములు 17:5–6ఇశ్రా యేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు నేను ఒక యింటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని. నేను ఇశ్రా యేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయుమీరు నాకొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్ట కుంటిరేమియని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞా పించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితో నైనను నేనొక మాటయైన పలికియుంటినా?
- Psalm 132:13 కీర్తనలు 132:13యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.
- 1 Kings 11:36 1 రాజులు 11:36నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.
- Jeremiah 7:12 యిర్మీయా 7:12పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు.
- 2 Chronicles 6:5–11 2 దినవృత్తాంతములు 6:5–11ఆయన సెలవిచ్చినదేమనగానేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలు కొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై యేమనుష్యునియైనను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి యైన దావీదు మనోభిలాష గలవాడాయెను. అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగానా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందస మును దానియందు ఉంచితినని చెప్పి
- Psalm 89:19–20 కీర్తనలు 89:19–20అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.
- Psalm 78:70 కీర్తనలు 78:70తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలోనుండి అతని పిలిపించెను.
Original words (Hebrew)
- day · H3117יוֹם yôwm
- forth · H3318יָצָא yâtsâʼ
- people · H5971עַם ʻam
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- Egypt · H4714מִצְרַיִם Mitsrayim
- chose · H977בָּחַר bâchar
- city · H5892עִיר ʻîyr
- tribes · H7626שֵׁבֶט shêbeṭ
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- build · H1129בָּנָה bânâh
- house · H1004בַּיִת bayith
- name · H8034שֵׁם shêm
- chose · H977בָּחַר bâchar
- David · H1732דָּוִד Dâvid
- people · H5971עַם ʻam
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl