1 Kings · chapter 8 · verse 61
1 Kings 8:61 in Telugu
కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచు కొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయ ములను చేకొనుటను, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక.
Kaabatti aayana niyaminchina kattadalanu anusarinchi naduchu konutakunu, ee dinamandunnatlu aayana chesina nirnaya mulanu chekonutanu, mee hrudayamu mee devudaina yehovaa vishayamai sarvasiddhamugaa nundunugaaka.
1 Kings 8:61 in English
- King James Version (KJV)
- Let your heart therefore be perfect with the LORD our God, to walk in his statutes, and to keep his commandments, as at this day.
- World English Bible (WEB)
- “Let your heart therefore be perfect with the LORD our God, to walk in his statutes, and to keep his commandments, as it is today.”
- American Standard Version (ASV)
- Let your heart therefore be perfect with Jehovah our God, to walk in his statutes, and to keep his commandments, as at this day.
- Bible in Basic English (BBE)
- Then let your hearts be without sin before the Lord our God, walking in his laws and keeping his orders as at this day.
- Darby Translation (DBY)
- and that your heart may be perfect with Jehovah our God, to walk in his statutes and to keep his commandments, as at this day.
- Webster's Bible (WBS)
- Let your heart therefore be perfect with the LORD our God, to walk in his statutes, and to keep his commandments, as at this day.
- Young's Literal Translation (YLT)
- and your heart hath been perfect with Jehovah our God, to walk in His statutes, and to keep His commands, as [at] this day.'
Read in context
- 59ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇశ్రాయేలీయులగు తన జనుల కార్యమును అవసరముచొప్పున, ఎల్లప్పుడును నిర్వహించునట్లుగా నేను యెహోవా యెదుట విన్నపము చేసిన యీ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక.
- 60అప్పుడు లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసికొందురు.
- 61కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచు కొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయ ములను చేకొనుటను, మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక.
- 62అంతట రాజును, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా
- 63ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱెలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయు లందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి.
Cross references
- 1 Kings 11:4 1 రాజులు 11:4సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.
- 2 Kings 20:3 2 రాజులు 20:3యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.
- 1 Kings 15:14 1 రాజులు 15:14ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను.
- 1 Kings 15:3 1 రాజులు 15:3అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను; తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవాయెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు.
- Deuteronomy 18:13 ద్వితీయోపదేశకాండము 18:13నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.
- 2 Corinthians 7:1 2 కొరింథీయులకు 7:1ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
- 1 Chronicles 28:9 1 దినవృత్తాంతములు 28:9సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
- Job 1:8 యోబు 1:8అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.
- Genesis 17:1 ఆదికాండము 17:1అబ్రాము తొంబదితొమ్మిది యేండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
- Philippians 3:12–16 ఫిలిప్పీయులకు 3:12–16ఇదివరకే నేను గెలిచితి ననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును. అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము.
- Job 1:1 యోబు 1:1ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
- Psalm 37:37 కీర్తనలు 37:37నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు