1 Peter · chapter 4 · verse 5
1 Peter 4:5 in Telugu
సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.
Sajeevulakunu mrutulakunu teerputeerchutaku siddhamugaa unnavaaniki vaaruttaravaadulaiyunnaaru.
1 Peter 4:5 in English
- King James Version (KJV)
- Who shall give account to him that is ready to judge the quick and the dead.
- World English Bible (WEB)
- They will give account to him who is ready to judge the living and the dead.
- American Standard Version (ASV)
- who shall give account to him that is ready to judge the living and the dead.
- Bible in Basic English (BBE)
- But they will have to give an account of themselves to him who is ready to be the judge of the living and the dead.
- Darby Translation (DBY)
- who shall render account to him who is ready to judge [the] living and [the] dead.
- Webster's Bible (WBS)
- Who shall give account to him that is ready to judge the living and the dead.
- Young's Literal Translation (YLT)
- who shall give an account to Him who is ready to judge living and dead,
Read in context
- 3మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,
- 4అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.
- 5సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.
- 6మృతులు శరీరవిషయములో మానవరీత్య తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికికూడ సువార్త ప్రకటింపబడెను.
- 7అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
Cross references
- James 5:9 యాకోబు 5:9సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.
- Acts 10:42 అపొస్తలుల కార్యములు 10:42ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధి పతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.
- 2 Timothy 4:1 2 తిమోతికి 4:1దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
- Romans 14:10–12 రోమీయులకు 14:10–12అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.
- John 5:22–23 యోహాను 5:22–23తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
- Matthew 12:36 మత్తయి 12:36నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.
- Jude 1:14–15 యూదా 1:14–15ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.
- Acts 17:31 అపొస్తలుల కార్యములు 17:31ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
- Malachi 3:13–15 మలాకీ 3:13–15యెహోవా సెలవిచ్చునదేమనగానన్నుగూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికినిన్నుగూర్చి యేమి చెప్పితి మని మీరడుగుదురు. దేవుని సేవచేయుట నిష్ఫల మనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యు లగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.
- 1 Corinthians 15:51–52 1 కొరింథీయులకు 15:51–52ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
- Psalm 1:6 కీర్తనలు 1:6నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.
- John 5:28–29 యోహాను 5:28–29దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.