1 Samuel · chapter 11 · verse 13
1 Samuel 11:13 in Telugu
సౌలునేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను.
Saulunedu yehovaa ishraayeleeyulaku rakshana kalugajesenu ganuka ee dinamuna e manushyuni meeru champavaddanenu.
1 Samuel 11:13 in English
- King James Version (KJV)
- And Saul said, There shall not a man be put to death this day: for to day the LORD hath wrought salvation in Israel.
- World English Bible (WEB)
- Saul said, “No man shall be put to death today; for today the LORD has rescued Israel.”
- American Standard Version (ASV)
- And Saul said, There shall not a man be put to death this day; for to-day Jehovah hath wrought deliverance in Israel.
- Bible in Basic English (BBE)
- And Saul said, Not a man is to be put to death today: for today the Lord has made Israel safe.
- Darby Translation (DBY)
- But Saul said, There shall not a man be put to death this day; for to-day Jehovah has wrought deliverance in Israel.
- Webster's Bible (WBS)
- And Saul said, There shall not a man be put to death this day: for to-day the LORD hath wrought salvation in Israel.
- Young's Literal Translation (YLT)
- And Saul saith, 'There is no man put to death on this day, for to-day hath Jehovah wrought salvation in Israel.'
Read in context
- 11మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండుమధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతముచేయగా వారిలో మిగిలినవారు ఇద్దరేసికూడి పోజాలకుండ చెదరిపోయిరి.
- 12జనులుసౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా
- 13సౌలునేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను.
- 14మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా
- 15జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి.
Cross references
- Exodus 14:13 నిర్గమకాండము 14:13అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.
- 1 Samuel 19:5 1 సమూయేలు 19:5అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీ యుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా
- 2 Samuel 19:22 2 సమూయేలు 19:22దావీదుసెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలువారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? యిప్పుడు నేను ఇశ్రాయేలువారిమీద రాజు నైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమా ణముచేసి
- 1 Samuel 14:45 1 సమూయేలు 14:45అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.
- Psalm 44:4–8 కీర్తనలు 44:4–8దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ క లుగ నాజ్ఞాపించుము. నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. (సెలా. )
- Exodus 14:30 నిర్గమకాండము 14:30ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రతీరమున చూచిరి.
- Isaiah 59:16 యెషయా 59:16సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.
- 1 Corinthians 15:10 1 కొరింథీయులకు 15:10అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.