1 Thessalonians · chapter 4 · verse 12
1 Thessalonians 4:12 in Telugu
మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.
Mee sontakaaryamulanu jarupukonuta yandunu mee chetulato panicheyutayandunu aashakaligi yundavalenaniyu, mimmunu hechcharinchuchunnaamu.
1 Thessalonians 4:12 in English
- King James Version (KJV)
- That ye may walk honestly toward them that are without, and [that] ye may have lack of nothing.
- World English Bible (WEB)
- that you may walk properly toward those who are outside, and may have need of nothing.
- American Standard Version (ASV)
- that ye may walk becomingly toward them that are without, and may have need of nothing.
- Bible in Basic English (BBE)
- That you may be respected by those who are outside, and may have need of nothing.
- Darby Translation (DBY)
- that ye may walk reputably towards those without, and may have need of no one.
- Webster's Bible (WBS)
- That ye may walk honestly towards them that are without, and [that] ye may have need of nothing.
- Young's Literal Translation (YLT)
- that ye may walk becomingly unto those without, and may have lack of nothing.
Read in context
- 10ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహో దరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభి వృద్ధినొందుచుండవలెననియు,
- 11సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,
- 12మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.
- 13సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.
- 14యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.
Cross references
- Colossians 4:5 కొలొస్సయులకు 4:5సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచు కొనుడి.
- 1 Peter 2:12 1 పేతురు 2:12అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
- Romans 12:17 రోమీయులకు 12:17కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.
- Romans 13:13 రోమీయులకు 13:13అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము.
- 1 Timothy 3:7 1 తిమోతికి 3:7మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.
- Mark 4:11 మార్కు 4:11అందుకాయన దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని
- 1 Peter 3:16–17 1 పేతురు 3:16–17అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్త మాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.
- 1 Thessalonians 5:22 1 థెస్సలొనీకయులకు 5:22ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.
- Titus 2:8–10 తీతుకు 2:8–10నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దాసులైనవారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంక రించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోష పెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము.
- 2 Corinthians 8:20–21 2 కొరింథీయులకు 8:20–21మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.
- Philippians 4:8 ఫిలిప్పీయులకు 4:8మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.
- 1 Peter 3:1 1 పేతురు 3:1అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;