2 Chronicles · chapter 28 · verse 21
2 Chronicles 28:21 in Telugu
ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతుల యొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు.
Aahaaju bhaagamu lerparachi, yehovaa mandiramulonundi yoka bhaagamunu, raajanagarulonundi yoka bhaagamunu, adhipatula yodda nundi yoka bhaagamunu teesi ashshooru raajuna kichchenu gaani atadu ataniki sahaayamu cheyaledu.
2 Chronicles 28:21 in English
- King James Version (KJV)
- For Ahaz took away a portion [out] of the house of the LORD, and [out] of the house of the king, and of the princes, and gave [it] unto the king of Assyria: but he helped him not.
- World English Bible (WEB)
- For Ahaz took away a portion out of the LORD’s house, and out of the house of the king and of the princes, and gave it to the king of Assyria; but it didn’t help him.
- American Standard Version (ASV)
- For Ahaz took away a portion out of the house of Jehovah, and out of the house of the king and of the princes, and gave it unto the king of Assyria: but it helped him not.
- Bible in Basic English (BBE)
- For Ahaz took a part of the wealth from the house of the Lord, and from the house of the king and of the great men, and gave it to the king of Assyria; but it was no help to him.
- Darby Translation (DBY)
- For Ahaz stripped the house of Jehovah, and the house of the king and of the princes, and gave to the king of Assyria; but he was of no help to him.
- Webster's Bible (WBS)
- For Ahaz took away a portion from the house of the LORD, and from the house of the king, and of the princes, and gave [it] to the king of Assyria: but he helped him not.
- Young's Literal Translation (YLT)
- though Ahaz hath taken a portion [out] of the house of Jehovah, and [out] of the house of the king, and of the princes, and giveth to the king of Asshur, yet it is no help to him.
Read in context
- 19ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదావారిని హీనపరచెను.
- 20అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనే గాని అతని బలపరచలేదు.
- 21ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతుల యొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు.
- 22ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధిక ముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.
- 23ఎట్లనగాసిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదనను కొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను; అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.
Cross references
- 2 Kings 16:8–9 2 రాజులు 16:8–9నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి, దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని, రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.
- 2 Kings 18:15–16 2 రాజులు 18:15–16కావున హిజ్కియా యెహోవా మందిర మందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను.
- 2 Chronicles 12:9 2 దినవృత్తాంతములు 12:9ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను.
- Proverbs 20:25 సామెతలు 20:25వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును.