2 Chronicles · chapter 30 · verse 19
2 Chronicles 30:19 in Telugu
పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా
Parishuddhasthalamuyokka shuddheekaranamuchoppuna tannu pavitraparachukonakaye tana pitarula devudaina yehovaanu aashrayimpa manassu nilupukonina prati vaani nimittamu dayagala yehovaa praayashchittamu cheyunugaaka ani praarthimpagaa
2 Chronicles 30:19 in English
- King James Version (KJV)
- [That] prepareth his heart to seek God, the LORD God of his fathers, though [he be] not [cleansed] according to the purification of the sanctuary.
- World English Bible (WEB)
- who sets his heart to seek God, the LORD, the God of his fathers, even if they aren’t clean according to the purification of the sanctuary.”
- American Standard Version (ASV)
- that setteth his heart to seek God, Jehovah, the God of his fathers, though [he be] not [cleansed] according to the purification of the sanctuary.
- Bible in Basic English (BBE)
- Who, with all his heart, is turned to God the Lord, the God of his fathers, even if he has not been made clean after the rules of the holy place.
- Darby Translation (DBY)
- that has directed his heart to seek God, Jehovah the God of his fathers, although not according to the purification of the sanctuary.
- Webster's Bible (WBS)
- [That] prepareth his heart to seek God, the LORD God of his fathers, though [he is] not [cleansed] according to the purification of the sanctuary.
- Young's Literal Translation (YLT)
- who hath prepared his heart to seek God — Jehovah, God of his fathers — yet not according to the cleansing of the sanctuary;'
Read in context
- 17సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారనేకు లుండుటచేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కాపశువులను వధించుపని లేవీయుల కప్పగింపబడెను.
- 18ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా
- 19పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా
- 20యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.
- 21యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోష భరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములుఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి.
Cross references
- 2 Chronicles 19:3 2 దినవృత్తాంతములు 19:3అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.
- Proverbs 23:26 సామెతలు 23:26నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,
- Psalm 10:17 కీర్తనలు 10:17యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లుబాధపడువారి కోరికను నీవు విని యున్నావు
- Job 11:13 యోబు 11:13నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల నీ చేతులు ఆయనవైపు చాపినయెడల
- 2 Chronicles 20:33 2 దినవృత్తాంతములు 20:33అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు, అతడు ఉన్నతస్థలములను తీసివేయలేదు.
- Ezra 7:10 ఎజ్రా 7:10ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను.
- 1 Chronicles 29:18 1 దినవృత్తాంతములు 29:18అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయ పూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము.
- Numbers 19:13–20 సంఖ్యాకాండము 19:13–20నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వాని కుండును. ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును. మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవము నైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును. అప విత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారముమీదను దానిలోని సమస్త మైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యుల మీదను, ఎముకనే గాని నరకబడిన వానినేగాని శవమునే గాని సమాధినేగాని ముట్టినవాని మీదను దానిని ప్రోక్షింపవలెను. మూడవ దినమున ఏడవ దినమున పవి త్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధిచేసికొనని యెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును; వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు; వాడు అపవిత్రుడు.
- 1 Samuel 7:3 1 సమూయేలు 7:3సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెనుమీ పూర్ణహృదయ ముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయ నను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.
- Leviticus 21:17–23 లేవీయకాండము 21:17–23నీవు అహరోనుతో ఇట్లనుమునీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడే గాని కాలైనను చేయినైనను విరిగినవాడే గాని గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పిం చుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు. అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీ పింపకూడదు;
- Leviticus 15:31–33 లేవీయకాండము 15:31–33ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థల మును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను. స్రావముగలవానిగూర్చియు, వీర్యస్ఖలనమువలని అప విత్రతగలవానిగూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.
- Numbers 9:6 సంఖ్యాకాండము 9:6కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింప లేకపోయిరి.