2 Kings · chapter 15 · verse 12
2 Kings 15:12 in Telugu
నీ కుమారులు నాలుగవ తరమువరకు ఇశ్రాయేలు సింహాసనముమీద ఆసీనులై యుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాటచొప్పున ఇది జరిగెను.
Nee kumaarulu naalugava taramuvaraku ishraayelu sinhaasanamumeeda aaseenulai yundurani yehovaa yehooto selavichchina maatachoppuna idi jarigenu.
2 Kings 15:12 in English
- King James Version (KJV)
- This [was] the word of the LORD which he spake unto Jehu, saying, Thy sons shall sit on the throne of Israel unto the fourth [generation]. And so it came to pass.
- World English Bible (WEB)
- This was the LORD’s word which he spoke to Jehu, saying, “Your sons to the fourth generation shall sit on the throne of Israel.” So it came to pass.
- American Standard Version (ASV)
- This was the word of Jehovah which he spake unto Jehu, saying, Thy sons to the fourth generation shall sit upon the throne of Israel. And so it came to pass.
- Bible in Basic English (BBE)
- This was what the Lord had said to Jehu, Your sons to the fourth generation will be kings of Israel. And so it came about.
- Darby Translation (DBY)
- This was the word of Jehovah which he spoke to Jehu saying, Thy sons shall sit upon the throne of Israel unto the fourth [generation]. And so it came to pass.
- Webster's Bible (WBS)
- This [was] the word of the LORD which he spoke to Jehu, saying, Thy sons shall sit on the throne of Israel to the fourth [generation] . And so it came to pass.
- Young's Literal Translation (YLT)
- It [is] the word of Jehovah that He spake unto Jehu, saying, 'Sons of the fourth [generation] do sit for thee on the throne of Israel;' and it is so.
Read in context
- 10యాబేషు కుమారుడైన షల్లూము అతనిమీద కుట్రచేసి, జనులు చూచుచుండగా అతనిమీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను.
- 11జెకర్యా చేసిన కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
- 12నీ కుమారులు నాలుగవ తరమువరకు ఇశ్రాయేలు సింహాసనముమీద ఆసీనులై యుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాటచొప్పున ఇది జరిగెను.
- 13యూదారాజైన ఉజ్జియా యేలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెల దినములు ఏలెను.
- 14గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను.
Cross references
- 2 Kings 10:30 2 రాజులు 10:30కావున యెహోవా యెహూతో నీలాగు సెల విచ్చెనునీవు నా హృదయాలోచన యంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరము వరకు ఇశ్రాయేలురాజ్య సింహాసనముమీద ఆసీనులగుదురు.
- John 19:24 యోహాను 19:24వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను;ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి.
- Acts 1:16 అపొస్తలుల కార్యములు 1:16సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.
- John 10:35 యోహాను 10:35లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
- Zechariah 1:6 జెకర్యా 1:6అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగిమన ప్రవర్తననుబట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.
- John 19:36–37 యోహాను 19:36–37అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.
- 2 Kings 13:10 2 రాజులు 13:10యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునారు సంవత్సరములు ఏలెను.
- Mark 13:31 మార్కు 13:31ఆకాశమును భూమియును గతించునుగాని నా మాటలు గతింపవు.
- 2 Kings 14:29 2 రాజులు 14:29యరొబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను.
- 2 Kings 9:25–26 2 రాజులు 9:25–26కాగా యెహూ తన అధిపతియైన బిద్కరును పిలిచి యిట్లనెను అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము; మనమిద్దరమును అతని తండ్రియైన అహాబు వెనుక గుఱ్ఱములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనిమీద ఈ శిక్షమోపిన సంగతి జ్ఞాపకము చేసికొనుము. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి యీ భూభాగమందు పడవేయుము అనెను.
- 2 Kings 13:13 2 రాజులు 13:13యెహోయాషు తన పితరులతో కూడ నిద్రిం చిన తరువాత యరొబాము అతని సింహాసనముమీద ఆసీనుడాయెను; యెహోయాషు షోమ్రోనులో ఇశ్రా యేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను.
- 2 Kings 9:36–37 2 రాజులు 9:36–37వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెనుఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున యిది జరిగెను.