John · chapter 10 · verse 35
John 10:35 in Telugu
లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
Lekhanamu nirarthakamu kaaneradu gadaa, devuni vaakyamevariki vachcheno vaare daivamulani cheppinayedala nenu devuni kumaarudanani cheppinanduku,
John 10:35 in English
- King James Version (KJV)
- If he called them gods, unto whom the word of God came, and the scripture cannot be broken;
- World English Bible (WEB)
- If he called them gods, to whom the word of God came (and the Scripture can’t be broken),
- American Standard Version (ASV)
- If he called them gods, unto whom the word of God came (and the scripture cannot be broken),
- Bible in Basic English (BBE)
- If he said they were gods, to whom the word of God came (and the Writings may not be broken),
- Darby Translation (DBY)
- If he called them gods to whom the word of God came (and the scripture cannot be broken),
- Webster's Bible (WBS)
- If he called them gods, to whom the word of God came, and the scripture cannot be broken;
- Young's Literal Translation (YLT)
- if them he did call gods unto whom the word of God came, (and the Writing is not able to be broken,)
Read in context
- 33అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
- 34అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?
- 35లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
- 36తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?
- 37నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,
Cross references
- Matthew 24:35 మత్తయి 24:35ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు.
- Romans 13:1 రోమీయులకు 13:1ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.
- Genesis 15:1 ఆదికాండము 15:1ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.
- Luke 16:17 లూకా 16:17ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము.
- Luke 24:44–46 లూకా 24:44–46అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దిన మున మృతులలోనుండి లేచుననియు
- Acts 1:16 అపొస్తలుల కార్యములు 1:16సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.
- John 19:36–37 యోహాను 19:36–37అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.
- Matthew 26:53–56 మత్తయి 26:53–56ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా? నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగ వలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.
- 1 Samuel 14:36–37 1 సమూయేలు 14:36–37అంతటమనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించువా డొకడును లేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలుయాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవునియొద్ద విచారణ చేయుదము రండని చెప్పి సౌలుఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను.
- Luke 24:26–27 లూకా 24:26–27క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
- 2 Chronicles 11:2–3 2 దినవృత్తాంతములు 11:2–3దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు యూదారాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను, యూదా యందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోను ఈ మాట ప్రకటించుము
- Deuteronomy 18:18–20 ద్వితీయోపదేశకాండము 18:18–20వారి సహో దరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను.