2 Kings · chapter 25 · verse 9
2 Kings 25:9 in Telugu
యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేము నందున్న యిండ్లన్నిటిని గొప్పవారి యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను.
Yehovaa mandiramunu raajanagarunu yerooshalemu nandunna yindlannitini goppavaari yindlannitini agnicheta kaalpinchenu.
2 Kings 25:9 in English
- King James Version (KJV)
- And he burnt the house of the LORD, and the king’s house, and all the houses of Jerusalem, and every great [man’s] house burnt he with fire.
- World English Bible (WEB)
- He burned the LORD’s house, the king’s house, and all the houses of Jerusalem. He burned every great house with fire.
- American Standard Version (ASV)
- And he burnt the house of Jehovah, and the king’s house; and all the houses of Jerusalem, even every great house, burnt he with fire.
- Bible in Basic English (BBE)
- And he had the house of the Lord and the king's house and all the houses of Jerusalem, even every great house, burned with fire;
- Darby Translation (DBY)
- and he burned the house of Jehovah, and the king's house, and all the houses of Jerusalem; and every great [man's] house he burned with fire.
- Webster's Bible (WBS)
- And he burnt the house of the LORD, and the king's house, and all the houses of Jerusalem, and every great [man's] house he burnt with fire.
- Young's Literal Translation (YLT)
- and he burneth the house of Jehovah, and the house of the king, and all the houses of Jerusalem, yea, every great house he hath burned with fire;
Read in context
- 7సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి.
- 8మరియు బబులోనురాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో పందొమ్మిదవ సంవత్సరమందు అయిదవ నెల యేడవ దినమున రాజదేహసంరక్షకులకు అధిపతియు బబులోనురాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి
- 9యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేము నందున్న యిండ్లన్నిటిని గొప్పవారి యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను.
- 10మరియు రాజదేహసంరక్షకుల అధి పతియొద్దనున్న కల్దీయుల సైనికులందరును యెరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి.
- 11పట్టణమందు మిగిలి యుండిన వారిని, బబులోనురాజు పక్షము చేరిన వారిని, సామాన్యజనులలో శేషించినవారిని రాజదేహ సంరక్షకుల అధిపతియైన నెబూజరదాను చెరగొని పోయెను గాని
Cross references
- Amos 2:5 ఆమోసు 2:5యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును.
- Psalm 74:3–7 కీర్తనలు 74:3–7శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడుచేసియున్నారు నిత్యము పాడైయుండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించు చున్నారు విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురుమీద జనులు గొడ్డండ్ల నెత్తి నట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు దురు.
- Micah 3:12 మీకా 3:12కాబట్టి చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.
- 1 Kings 9:8 1 రాజులు 9:8ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యనియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలా గున ఎందుకు చేసెనని యడుగగా
- Psalm 79:1 కీర్తనలు 79:1దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి యున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.
- 2 Chronicles 36:19 2 దినవృత్తాంతములు 36:19అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి.
- Acts 6:13–14 అపొస్తలుల కార్యములు 6:13–14అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.
- Jeremiah 34:22 యిర్మీయా 34:22యెహోవా వాక్కు ఇదేనేను ఆజ్ఞ ఇచ్చి యీ పట్టణమునకు వారిని మరల రప్పించు చున్నాను, వారు దానిమీద యుద్ధముచేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు; మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును.
- Jeremiah 37:10 యిర్మీయా 37:10మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.
- Jeremiah 52:13 యిర్మీయా 52:13అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చి వేసెను.
- Jeremiah 37:8 యిర్మీయా 37:8కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్ని చేత కాల్చి వేయుదురు.
- Isaiah 64:10–11 యెషయా 64:10–11నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.