2 Samuel · chapter 1 · verse 24
2 Samuel 1:24 in Telugu
ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడుబంగారు నగలు మీకు పెట్టినవాడు.
Ishraayeleeyula kumaartelaaraa, saulunugoorchi yedvudi atadu meeku impaina raktavarnapu vastramulu dharimpa jesinavaadubangaaru nagalu meeku pettinavaadu.
2 Samuel 1:24 in English
- King James Version (KJV)
- Ye daughters of Israel, weep over Saul, who clothed you in scarlet, with [other] delights, who put on ornaments of gold upon your apparel.
- World English Bible (WEB)
- You daughters of Israel, weep over Saul, who clothed you delicately in scarlet, who put ornaments of gold on your clothing.
- American Standard Version (ASV)
- Ye daughters of Israel, weep over Saul, Who clothed you in scarlet delicately, Who put ornaments of gold upon your apparel.
- Bible in Basic English (BBE)
- O daughters of Israel, have sorrow for Saul, by whom you were delicately clothed in robes of red, with ornaments of gold on your dresses.
- Darby Translation (DBY)
- Ye daughters of Israel, weep over Saul, who clothed you in scarlet with splendour, Who put ornaments of gold upon your apparel.
- Webster's Bible (WBS)
- Ye daughters of Israel, weep over Saul, who clothed you in scarlet, with [other] delights, who put ornaments of gold upon your apparel.
- Young's Literal Translation (YLT)
- Daughters of Israel! for Saul weep ye, Who is clothing you [in] scarlet with delights. Who is lifting up ornaments of gold on your clothing.
Read in context
- 22హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండయోనాతాను విల్లు వెనుకతియ్యలేదుఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు.
- 23సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులు గాను నెనరుగల వారుగాను ఉండిరితమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారువారు పక్షిరాజులకంటె వడిగలవారుసింహములకంటె బలముగలవారు.
- 24ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడుబంగారు నగలు మీకు పెట్టినవాడు.
- 25యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారునీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను.
- 26నా సహోదరుడా, యోనాతానానీవు నాకు అతిమనోహరుడవై యుంటివినీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నానునాయందు నీకున్న ప్రేమ బహు వింతైనదిస్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.
Cross references
- 1 Peter 3:3–5 1 పేతురు 3:3–5జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.
- 1 Timothy 2:9–10 1 తిమోతికి 2:9–10మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించు కొనవలెను.
- Isaiah 3:16–26 యెషయా 3:16–26మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు; కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.
- Jeremiah 2:32 యిర్మీయా 2:32కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.
- Judges 5:30 న్యాయాధిపతులు 5:30వారికి దొరకెను గదా? దోపుడుసొమ్ము పంచుకొను చున్నారు గదా? యోధులందరు తలాయొక స్త్రీని తీసికొందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సీసెరాకు రంగువేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరకును రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరకును రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనినవారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును.
- Psalm 68:12 కీర్తనలు 68:12సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును.
- Proverbs 31:21 సామెతలు 31:21తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు.