2 Samuel · chapter 10 · verse 1
2 Samuel 10:1 in Telugu
పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను.
Pimmata ammonu raaju mruti nondagaa atani kumaarudagu haanoonu atani raajyamu neluchundenu.
2 Samuel 10:1 in English
- King James Version (KJV)
- And it came to pass after this, that the king of the children of Ammon died, and Hanun his son reigned in his stead.
- World English Bible (WEB)
- After this, the king of the children of Ammon died, and Hanun his son reigned in his place.
- American Standard Version (ASV)
- And it came to pass after this, that the king of the children of Ammon died, and Hanun his son reigned in his stead.
- Bible in Basic English (BBE)
- Now after this, death came to the king of the children of Ammon, and Hanun, his son, became king in his place.
- Darby Translation (DBY)
- And it came to pass after this that the king of the children of Ammon died, and Hanun his son reigned in his stead.
- Webster's Bible (WBS)
- And it came to pass after this, that the king of the children of Ammon died, and Hanun his son reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass afterwards, that the king of the Bene-Ammon dieth, and Hanun his son reigneth in his stead,
Read in context
- 1పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను.
- 2దావీదు హానూను తండ్రియైన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని, అతని తండ్రి నిమి త్తము అతని నోదార్చుటకై తన సేవకులచేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా
- 3అమ్మోనీయుల ఘనులు తమ రాజగు హానూనుతో ఈలాగు మనవిచేసిరినీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీయొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశము చేయవలెనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించియున్నాడని నీకు తోచ లేదా?
Cross references
- 1 Samuel 11:1–3 1 సమూయేలు 11:1–3అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరుమేము నీకు సేవచేయుదుము, మాతో నిబంధనచేయుమని నాహాషుతో అనిరి ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చునట్లు మీయందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసెదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారుమేము ఇశ్రాయేలీయుల సరిహద్దు లన్నిటికి దూతలను పంపుటకై యేడు దినముల గడువు మాకిమ్ము; మమ్మును రక్షించుటకు ఎవరును లేక పోయిన యెడల మమ్మును మేము నీకప్పగించుకొనెద మనిరి.
- Judges 10:7–9 న్యాయాధిపతులు 10:7–9యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపుర మున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదాదేశస్థులతోను బెన్యామీనీయులతోను ఎఫ్రాయి మీయులతోను యుద్ధముచేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను
- 1 Chronicles 19:1–19 1 దినవృత్తాంతములు 19:1–19ఇదియైన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. అప్పుడు దావీదుహానూను తండ్రియైన నాహాషు నా యెడల దయ చూపించెను గనుక నేను అతనికుమారుని యెడల దయ చూపెదనని యనుకొని, అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల యధి పతులు హానూనుతోనిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపరచుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకేగదా అతని సేవకులు నీయొద్దకు వచ్చియున్నారు అని మనవి చేయగా హానూను దావీదు సేవకులను పట్టుకొని, వారిని గొరిగించి, వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను. ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరువచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి; వారు బహు లజ్జాక్రాంతులై యుండిరి గనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపిమీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమాన మంపెను. అమ్మోనీయులు దావీదునకు తమయందు అసహ్యము పుట్టించితిమని తెలిసికొనినప్పుడు హానూనును అమ్మోనీయులును అరామ్నహరయీము నుండియు, సిరియా మయకానుండియు సోబానుండియు రథములను గుఱ్ఱపురౌతులను రెండువేల మణుగుల వెండిఇచ్చి బాడిగెకు కుదుర్చుకొనిరి. ముప్పది రెండువేల రథములతో వచ్చునట్లు జీతమిచ్చి మయకారాజును అతని జనులను కుదుర్చుకొనిరి; వీరు వచ్చి మేదెబా ముందరితట్టున దిగిరి, అమ్మోనీయులు తమతమ పట్టణములలోనుండి కూడుకొని యుద్దముచేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలుల నందరిని పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధపంక్తులు తీర్చిరి, వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను రెండు సైన్యముల మధ్యను చిక్కుబడి యుండుట చూచి, యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని, సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి, కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి, తన సహోదరుడైన అబీషైకి అప్పగించి యిట్లనెను సిరియనుల బలమునకు నేను నిలువ లేకపోయినయెడల నీవు నాకు సహాయము చేయవలెను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయినయెడల నేను నీకు సహాయము చేయుదును. ధైర్యము కలిగియుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము; యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడ నున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువ లేక అతని యెదుటనుండి తిరిగి పారిపోయిరి. సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషైముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి, యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలిసికొనినప్పుడు వారు దూతలను పంపి, యేటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి, హదరెజెరుయొక్క సైన్యాధిపతియైన షోపకు వారికి నాయకుడాయెను. దావీదు ఆ సంగతి తెలిసికొని ఇశ్రా యేలీయులనందరిని సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారియెదుట సైన్యములను వ్యూహపరచెను, దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువక తిరిగి పారి పోయిరి;దావీదు సిరియనులలో ఏడువేల రథికులను నలుబది వేల కాల్బలమును హతముచేసి సైన్యాధిపతియైన షోపకును చంపి వేసెను. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని హదరెజెరుయొక్క సేవకులు తెలిసికొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటినుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సులేక యుండిరి.
- Judges 11:12–28 న్యాయాధిపతులు 11:12–28యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలనుపంపినాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని యడుగగా అమ్మోనీయుల రాజుఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమా ధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించు మని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూత లను పంపి యిట్లనెను యెఫ్తా సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపంపీ నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడునునేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రా యేలీయులు కాదేషులో నివసించిరి. తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా. మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపినీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశములో బడి వెళ్లనియ్యక, తన జనులనందరిని సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రా యేలీయులతో యుద్ధము చేసెను. అప్పుడు ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతముచేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బోకువరకును అరణ్యము మొదలుకొని యొర్దానువరకును అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనులయెదుట నిలువ కుండ తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా? స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకుకంటె నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా? అతడు ఇశ్రా యేలీయులతో ఎప్పుడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా? ఇశ్రాయేలీయులు హెప్బోను లోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరుల లోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు? ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు గాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధి పతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీ యులకును న్యాయము తీర్చును గాక. అయితే అమ్మోనీ యులరాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకుఒప్పుకొన లేదు.