1 Samuel · chapter 11 · verse 1
1 Samuel 11:1 in Telugu
అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరుమేము నీకు సేవచేయుదుము, మాతో నిబంధనచేయుమని నాహాషుతో అనిరి
Ammoneeyudaina naahaashu bayaluderi yaabeshgilaadu kedurugaa diginappudu yaabeshu vaarandarumemu neeku sevacheyudumu, maato nibandhanacheyumani naahaashuto aniri
1 Samuel 11:1 in English
- King James Version (KJV)
- Then Nahash the Ammonite came up, and encamped against Jabesh-gilead: and all the men of Jabesh said unto Nahash, Make a covenant with us, and we will serve thee.
- World English Bible (WEB)
- Then Nahash the Ammonite came up and encamped against Jabesh Gilead; and all the men of Jabesh said to Nahash, “Make a covenant with us, and we will serve you.”
- American Standard Version (ASV)
- Then Nahash the Ammonite came up, and encamped against Jabesh-gilead: and all the men of Jabesh said unto Nahash, Make a covenant with us, and we will serve thee.
- Bible in Basic English (BBE)
- Then about a month after this, Nahash the Ammonite came up and put his forces in position for attacking Jabesh-gilead: and all the men of Jabesh said to Nahash, Make an agreement with us and we will be your servants.
- Darby Translation (DBY)
- And Nahash the Ammonite came up and encamped against Jabesh-Gilead. And all the men of Jabesh said to Nahash, Make a covenant with us, and we will serve thee.
- Webster's Bible (WBS)
- Then Nahash the Ammonite came up, and encamped against Jabesh-gilead: and all the men of Jabesh said to Nahash, Make a covenant with us, and we will serve thee.
- Young's Literal Translation (YLT)
- And Nahash the Ammonite cometh up, and encampeth against Jabesh-Gilead, and all the men of Jabesh say unto Nahash, 'Make with us a covenant, and we serve thee.'
Read in context
- 1అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరుమేము నీకు సేవచేయుదుము, మాతో నిబంధనచేయుమని నాహాషుతో అనిరి
- 2ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చునట్లు మీయందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసెదనని అమ్మోనీయుడైన నాహాషు
- 3యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారుమేము ఇశ్రాయేలీయుల సరిహద్దు లన్నిటికి దూతలను పంపుటకై యేడు దినముల గడువు మాకిమ్ము; మమ్మును రక్షించుటకు ఎవరును లేక పోయిన యెడల మమ్మును మేము నీకప్పగించుకొనెద మనిరి.
Cross references
- 1 Samuel 12:12 1 సమూయేలు 12:12అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.
- 1 Kings 20:34 1 రాజులు 20:34అంతట బెన్హదదుతమ తండ్రి చేతిలోనుండి నా తండ్రి తీసికొనిన పట్టణములను నేను మరల అప్పగించెదను; మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమకొరకు తమరు వీధులను కట్టించు కొనవచ్చును అని అతనితో చెప్పగా అహాబు ఈ ప్రకారముగా నీతో సంధిచేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధిచేసి అతని పోనిచ్చెను.
- Ezekiel 17:13 యెహెజ్కేలు 17:13మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండు నట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును,
- Judges 21:8 న్యాయాధిపతులు 21:8మరియు వారు ఇశ్రాయేలీ యుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచా రింపగా
- Genesis 26:28 ఆదికాండము 26:28వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలె ననియు
- Exodus 23:32 నిర్గమకాండము 23:32నీవు వారితో నైనను వారి దేవ తలతోనైనను నిబంధన చేసికొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక
- Job 41:4 యోబు 41:4నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది నీతో నిబంధనచేయునా?
- Deuteronomy 23:3 ద్వితీయోపదేశకాండము 23:3అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.
- Judges 21:10–25 న్యాయాధిపతులు 21:10–25కాబట్టి సమాజపు వారు పరా క్రమవంతులైన పండ్రెండు వేలమంది మనుష్యులను పంపించి మీరు పోయి స్త్రీల నేమి పిల్లల నేమి యాబేష్గిలాదు నివాసులనందరిని కత్తివాతను హతము చేయుడి. మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి. యాబేష్గి లాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశ మందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొనివచ్చిరి. ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యా మీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచు టకును వర్తమానము పంపగా ఆ వేళను బెన్యా మీనీ యులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గి లాదు స్త్రీలలో బ్రదుకనిచ్చినవారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలక పోగా యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి యుండుట జనులు చూచి బెన్యామీనీయులనుగూర్చి పశ్చాత్తాపపడిరి. సమాజప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలినవారికి భార్యలు దొరుకు నట్లు మనమేమి చేయుదమని యోచించుకొని ఇశ్రా యేలీయులలోనుండి ఒక గోత్రము తుడిచివేయ బడకుండు నట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్య ముండవలెననిరి. ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన యెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడ దని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీనీయు లతో ఇట్లనిరిఇదిగో బేతేలుకు ఉత్తరదిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేట షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి మీరు వెళ్లి ద్రాక్షతోటలలో మాటుననుండి షిలోహు స్త్రీలు నాట్యమాడువారితో కలిసి నాట్యమాడుటకు బయలు దేరగా ద్రాక్షతోటలలోనుండి బయలు దేరివచ్చి పెండ్లి చేసికొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహో దరులైనను వాదించుటకు మీయొద్దకు వచ్చినయెడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి, ఈ సమయమున వారికిచ్చినయెడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెద మనిరి. కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలోనుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసికొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటుపిమ్మట ఇశ్రా యేలీయులలో ప్రతివాడును అక్కడనుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయెను. అందరును అక్కడనుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను.
- Judges 11:8–33 న్యాయాధిపతులు 11:8–33అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీయొద్దకు మళ్లి వచ్చితివిు; నీవు మాతోకూడ వచ్చి అమ్మోనీయులతో యుద్ధముచేసిన యెడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారి వవుదువని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొని పోయినమీదట యెహోవా వారిని నా చేతి కప్పగించిన యెడల నేనే మీకు ప్రధా నుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా గిలాదు పెద్దలునిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయు దుము; యెహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతినిగాను అతని నియమించు కొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను. యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలనుపంపినాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని యడుగగా అమ్మోనీయుల రాజుఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమా ధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించు మని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూత లను పంపి యిట్లనెను యెఫ్తా సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపంపీ నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడునునేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రా యేలీయులు కాదేషులో నివసించిరి. తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరి హద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరి హద్దు గదా. మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపినీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశములో బడి వెళ్లనియ్యక, తన జనులనందరిని సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రా యేలీయులతో యుద్ధము చేసెను. అప్పుడు ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతముచేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బోకువరకును అరణ్యము మొదలుకొని యొర్దానువరకును అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనులయెదుట నిలువ కుండ తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా? స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకుకంటె నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా? అతడు ఇశ్రా యేలీయులతో ఎప్పుడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా? ఇశ్రాయేలీయులు హెప్బోను లోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరుల లోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు? ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు గాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధి పతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీ యులకును న్యాయము తీర్చును గాక. అయితే అమ్మోనీ యులరాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకుఒప్పుకొన లేదు. యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగానీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చ యముగా అప్పగించినయెడల నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొను టకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను. అప్పుడుయెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్ప గించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్కెరా మీమువరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేష ముగా హతముచేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ అణచి వేయబడిరి.
- Isaiah 36:16 యెషయా 36:16హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు; అష్షూరురాజు సెలవిచ్చున దేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును.
- Judges 10:7 న్యాయాధిపతులు 10:7యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక
Original words (Hebrew)
- Nahash · H5176נָחָשׁ Nâchâsh
- Ammonite · H5984עַמּוֹנִי ʻAmmôwnîy
- up · H5927עָלָה ʻâlâh
- encamped · H2583חָנָה chânâh
- Jabesh-gilead · H3003יָבֵשׁ Yâbêsh
- men · H582אֱנוֹשׁ ʼĕnôwsh
- Jabesh · H3003יָבֵשׁ Yâbêsh
- said · H559אָמַר ʼâmar
- Nahash · H5176נָחָשׁ Nâchâsh
- Make · H3772כָּרַת kârath
- covenant · H1285בְּרִית bᵉrîyth
- serve · H5647עָבַד ʻâbad