2 Samuel · chapter 3 · verse 2
2 Samuel 3:2 in Telugu
హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను.
Hebronulo daaveedunaku puttina kumaarulevaranagaa, amnonu anu atani jyeshthaputrudu yejreyeleeyu raalagu aheenoyamuvalana puttenu.
2 Samuel 3:2 in English
- King James Version (KJV)
- And unto David were sons born in Hebron: and his firstborn was Amnon, of Ahinoam the Jezreelitess;
- World English Bible (WEB)
- Sons were born to David in Hebron. His firstborn was Amnon, of Ahinoam the Jezreelitess;
- American Standard Version (ASV)
- And unto David were sons born in Hebron: and his first-born was Amnon, of Ahinoam the Jezreelitess;
- Bible in Basic English (BBE)
- While David was in Hebron he became the father of sons: the oldest was Amnon, son of Ahinoam of Jezreel;
- Darby Translation (DBY)
- And to David were sons born in Hebron: his firstborn was Amnon, of Ahinoam the Jizreelitess;
- Webster's Bible (WBS)
- And to David were sons born in Hebron: and his first-born was Amnon, of Ahinoam the Jezreelitess;
- Young's Literal Translation (YLT)
- And there are born to David sons in Hebron, and his first-born is Amnon, of Ahinoam the Jezreelitess,
Read in context
- 1సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.
- 2హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను.
- 3కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగ యీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను.
- 4నాలుగవవాడగు అదోనీయా హగ్గీతువలన పుట్టెను. అయిదవవాడగు షెఫట్య అబీటలువలన పుట్టెను.
Cross references
- 1 Chronicles 3:1–4 1 దినవృత్తాంతములు 3:1–4దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు, గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా నాల్గవ వాడు, అబీటలు కనిన షెఫట్య అయిదవవాడు, అతని భార్యయైన ఎగ్లాకనిన ఇత్రెయాము ఆరవవాడు, ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,
- 1 Samuel 25:42–43 1 సమూయేలు 25:42–43త్వరగా లేచి గార్దభముమీద ఎక్కితన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతో కూడ దావీదు పంపిన దూతలవెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను. మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ యైన అహీనోయమును పెండ్లి చేసికొనియుండెను; వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి.
- 2 Samuel 13:1–29 2 సమూయేలు 13:1–29తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరియుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారునుబట్టి చిక్కిపోయెను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోనునా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. యెహోనాదాబునీవు రోగివైనట్టువేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవునా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను. అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోనునా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెల విమ్మని రాజుతో మనవి చేయగా దావీదునీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడునాకు వద్దని చెప్పిఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండ నెను. వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోనునీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గదిలోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొనినా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా ఆమెనా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచు కొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగు దువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము; అతడు నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను. అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమెయెడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటె అతడు మరి యెక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమెనన్ను బయటకు తోసివేయుటవలన నాకు నీవిప్పుడు చేసిన కీడుకంటె మరి యెక్కువకీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పని వారిలో ఒకని పిలిచిదీనిని నాయొద్దనుండి వెళ్లగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీరయొకటి ధరించి యుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియవేసెను. అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచినీ అన్నయగు అమ్నోను నిన్ను కూడినాడు గదా? నా చెల్లీ నీవు ఊర కుండుము; అతడు నీ అన్నే గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట నుండెను. ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయగు అమ్నోనుతో మంచి చెడ్డ లేమియు మాటలాడక ఊరకుండెను గాని, తన సహోదరియగు తామారును బలవంతము చేసి నందుకై అతనిమీద పగయుంచెను. రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చిచిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొఱ్ఱె బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను; రాజవైన నీవును నీ సేవకులును విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా రాజునా కుమారుడా, మమ్మును పిలువవద్దు; మేము నీకు అధిక భారముగా ఉందుము; మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను. అయితే దావీదు వెళ్ల నొల్లక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోమునీవు రాకపోయిన యెడల నా అన్నయగు అమ్నోను మాతోకూడ వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీయొద్దకు ఎందుకు రావలెనని రాజు అడుగగా అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరును అతని యొద్దకు పోవచ్చు నని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పు నప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి యున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.
- Genesis 49:3–4 ఆదికాండము 49:3–4రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.