2 Samuel · chapter 6 · verse 21
2 Samuel 6:21 in Telugu
నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రా యేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించు టకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని.
Nee tandrini atani santatini visarjinchi ishraa yeleeyulanu tana janulameeda nannu adhipatigaa nirnayinchu takai nannu yerparachukonina yehovaa sannidhini nenaalaagu chesitini; yehovaa sannidhini nenu aata aaditini.
2 Samuel 6:21 in English
- King James Version (KJV)
- And David said unto Michal, [It was] before the LORD, which chose me before thy father, and before all his house, to appoint me ruler over the people of the LORD, over Israel: therefore will I play before the LORD.
- World English Bible (WEB)
- David said to Michal, “It was before the LORD, who chose me above your father, and above all his house, to appoint me prince over the people of the LORD, over Israel. Therefore I will celebrate before the LORD.
- American Standard Version (ASV)
- And David said unto Michal, [It was] before Jehovah, who chose me above thy father, and above all his house, to appoint me prince over the people of Jehovah, over Israel: therefore will I play before Jehovah.
- Bible in Basic English (BBE)
- And David said to Michal, I was dancing before the Lord, who put me over your father and all his sons, to make me a ruler over the people of the Lord, over his people Israel: and I will go on playing before the Lord;
- Darby Translation (DBY)
- And David said to Michal, It was before Jehovah, who chose me rather than thy father, and than all his house, to appoint me ruler over the people of Jehovah, over Israel; and I played before Jehovah.
- Webster's Bible (WBS)
- And David said to Michal, [It was] before the LORD, who chose me before thy father, and before all his house, to appoint me ruler over the people of the LORD, over Israel: therefore will I play before the LORD.
- Young's Literal Translation (YLT)
- And David saith unto Michal, ' — Before Jehovah, who fixed on me above thy father, and above all his house, to appoint me leader over the people of Jehovah, and over Israel, — yea, I played before Jehovah;
Read in context
- 19సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీపురుషుల కందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.
- 20తన యింటివారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చిహీనస్థితి గల పనికత్తెలు చూచు చుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసియెంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు
- 21నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రా యేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించు టకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని.
- 22ఇంతకంటె మరి యెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను.
- 23మరణమువరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను.
Cross references
- Acts 13:22 అపొస్తలుల కార్యములు 13:22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.
- 2 Samuel 6:16 2 సమూయేలు 6:16యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్య మాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.
- 1 Samuel 13:14 1 సమూయేలు 13:14యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును.
- Psalm 89:19–20 కీర్తనలు 89:19–20అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.
- Psalm 78:70–72 కీర్తనలు 78:70–72తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలోనుండి అతని పిలిపించెను. పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.
- 1 Samuel 15:28 1 సమూయేలు 15:28అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెనునేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి యున్నాడు.
- 2 Samuel 6:5 2 సమూయేలు 6:5దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళము లను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.
- 1 Samuel 16:1 1 సమూయేలు 16:1అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెల విచ్చెనుఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖిం తువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
- 2 Samuel 6:14 2 సమూయేలు 6:14దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను.
- 1 Corinthians 10:31 1 కొరింథీయులకు 10:31కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.
- 1 Chronicles 15:29 1 దినవృత్తాంతములు 15:29యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలోనుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను.
- 1 Samuel 16:12 1 సమూయేలు 16:12అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానేనేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా
Original words (Hebrew)
- David · H1732דָּוִד Dâvid
- said · H559אָמַר ʼâmar
- Michal · H4324מִיכָל Mîykâl
- before · H6440פָּנִים pânîym
- chose · H977בָּחַר bâchar
- father · H1אָב ʼâb
- house · H1004בַּיִת bayith
- appoint · H6680צָוָה tsâvâh
- ruler · H5057נָגִיד nâgîyd
- people · H5971עַם ʻam
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- play · H7832שָׂחַק sâchaq
- before · H6440פָּנִים pânîym