2 Thessalonians · chapter 2 · verse 15
2 Thessalonians 2:15 in Telugu
కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి.
Kaabatti sahodarulaaraa, nilukadagaa undi maa notimaatavalananainanu maa patrika valananainanu meeku bodhimpabadina vidhulanu chepattudi.
2 Thessalonians 2:15 in English
- King James Version (KJV)
- Therefore, brethren, stand fast, and hold the traditions which ye have been taught, whether by word, or our epistle.
- World English Bible (WEB)
- So then, brothers, stand firm and hold the traditions which you were taught by us, whether by word or by letter.
- American Standard Version (ASV)
- So then, brethren, stand fast, and hold the traditions which ye were taught, whether by word, or by epistle of ours.
- Bible in Basic English (BBE)
- So then, brothers, be strong in purpose, and keep the teaching which has been given to you by word or by letter from us.
- Darby Translation (DBY)
- So then, brethren, stand firm, and hold fast the instructions which ye have been taught, whether by word or by our letter.
- Webster's Bible (WBS)
- Therefore, brethren, stand fast, and hold the traditions which ye have been taught, whether by word, or our epistle.
- Young's Literal Translation (YLT)
- so, then, brethren, stand ye fast, and hold the deliverances that ye were taught, whether through word, whether through our letter;
Read in context
- 13ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.
- 14మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.
- 15కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి.
- 16మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,
- 17మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్య మందును మిమ్మును స్థిరపరచును గాక.
Cross references
- 1 Corinthians 11:2 1 కొరింథీయులకు 11:2మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొను చున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను.
- 2 Thessalonians 3:6 2 థెస్సలొనీకయులకు 3:6సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము.
- 1 Corinthians 16:13 1 కొరింథీయులకు 16:13మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి;
- 2 Thessalonians 2:2 2 థెస్సలొనీకయులకు 2:2మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.
- Philippians 4:1 ఫిలిప్పీయులకు 4:1కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి.
- Romans 16:17 రోమీయులకు 16:17సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.
- 1 Corinthians 15:58 1 కొరింథీయులకు 15:58కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
- 2 Thessalonians 3:14 2 థెస్సలొనీకయులకు 3:14ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.
- Jude 1:3 యూదా 1:3ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
Original words (Greek)
- Therefore · G3767οὖν oûn
- brethren · G80ἀδελφός adelphós
- fast · G4739στήκω stḗkō
- and · G2532καί kaí
- hold · G2902κρατέω kratéō
- traditions · G3862παράδοσις parádosis
- which · G3739ὅς hós
- taught · G1321διδάσκω didáskō
- whether · G1535εἴτε eíte
- by · G1223διά diá
- word · G3056λόγος lógos
- or · G1535εἴτε eíte
- our · G2257ἡμῶν hēmōn
- epistle · G1992ἐπιστολή epistolḗ