Amos · chapter 8 · verse 7
Amos 8:7 in Telugu
యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా వారిక్రియలను నేనెన్నడును మరువను.
Yaakobu yokka atishayaaspadamu todani yehovaa pramaanamu cheyunademanagaa vaarikriyalanu nenennadunu maruvanu.
Amos 8:7 in English
- King James Version (KJV)
- The LORD hath sworn by the excellency of Jacob, Surely I will never forget any of their works.
- World English Bible (WEB)
- The LORD has sworn by the pride of Jacob, “Surely I will never forget any of their works.
- American Standard Version (ASV)
- Jehovah hath sworn by the excellency of Jacob, Surely I will never forget any of their works.
- Bible in Basic English (BBE)
- The Lord has taken an oath by the pride of Jacob, Truly I will ever keep in mind all their works.
- Darby Translation (DBY)
- Jehovah hath sworn by the glory of Jacob, Certainly I will never forget any of their works.
- Webster's Bible (WBS)
- The LORD hath sworn by the excellence of Jacob, Surely I will never forget any of their works.
- Young's Literal Translation (YLT)
- Sworn hath Jehovah by the excellency of Jacob: 'I forget not for ever any of their works.
Read in context
- 5తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా,
- 6దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.
- 7యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా వారిక్రియలను నేనెన్నడును మరువను.
- 8ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.
- 9ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్త మింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మ జేయుదును.
Cross references
- Amos 6:8 ఆమోసు 6:8ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణము చేసెను; ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు.
- Hosea 9:9 హోషేయ 9:9గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గు లైరి; యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొను చున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.
- Hosea 7:2 హోషేయ 7:2తమ క్రియల చేత వారు చిక్కుపడి యున్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసికొనడని తమలో తాము అనుకొందురు.
- Hosea 8:13 హోషేయ 8:13నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు; అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు, త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములనుబట్టి వారిని శిక్షించును; వారు మరల ఐగుప్తునకు వెళ్లవలసి వచ్చెను.
- Psalm 47:4 కీర్తనలు 47:4తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పద ముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు.
- Psalm 10:11 కీర్తనలు 10:11దేెెవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు.
- Isaiah 43:25 యెషయా 43:25నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.
- Jeremiah 17:1 యిర్మీయా 17:1వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్థంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా
- Deuteronomy 33:26–29 ద్వితీయోపదేశకాండము 33:26–29యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
- Jeremiah 31:34 యిర్మీయా 31:34నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.
- Psalm 68:34 కీర్తనలు 68:34దేవునికి బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలుమీద ఏలు చున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది
- Luke 2:32 లూకా 2:32నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.