Colossians · chapter 3 · verse 10
Colossians 3:10 in Telugu
మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.
Meeru parityajinchi, jnyaanamu kalugu nimittamu daanini srushtinchinavaani polikachoppuna nootana parachabaduchunna naveenasvabhaavamunu dharinchukoni yunnaaru.
Colossians 3:10 in English
- King James Version (KJV)
- And have put on the new [man], which is renewed in knowledge after the image of him that created him:
- World English Bible (WEB)
- and have put on the new man, who is being renewed in knowledge after the image of his Creator,
- American Standard Version (ASV)
- and have put on the new man, that is being renewed unto knowledge after the image of him that created him:
- Bible in Basic English (BBE)
- And have put on the new man, which has become new in knowledge after the image of his maker;
- Darby Translation (DBY)
- and having put on the new, renewed into full knowledge according to [the] image of him that has created him;
- Webster's Bible (WBS)
- And have put on the new [man] , which is renewed in knowledge after the image of him that created him:
- Young's Literal Translation (YLT)
- and having put on the new, which is renewed in regard to knowledge, after the image of Him who did create him;
Read in context
- 8ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.
- 9ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ
- 10మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.
- 11ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.
- 12కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి.
Cross references
- Ephesians 4:23–24 ఎఫెసీయులకు 4:23–24మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
- Romans 12:2 రోమీయులకు 12:2మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
- Colossians 3:12 కొలొస్సయులకు 3:12కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి.
- Ephesians 2:10 ఎఫెసీయులకు 2:10మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
- 2 Corinthians 5:17 2 కొరింథీయులకు 5:17కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
- Psalm 51:10 కీర్తనలు 51:10దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
- Ezekiel 11:19 యెహెజ్కేలు 11:19వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొను నట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.
- Colossians 3:14 కొలొస్సయులకు 3:14వీటన్నిటిపైన పరిపూర్ణతకు అను బంధమైన ప్రేమను ధరించుకొనుడి.
- Ezekiel 36:26 యెహెజ్కేలు 36:26నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
- Romans 13:14 రోమీయులకు 13:14మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.
- 1 John 2:5 1 యోహాను 2:5ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;
- 1 John 2:3 1 యోహాను 2:3మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము.