Colossians · chapter 4 · verse 1
Colossians 4:1 in Telugu
యజమానులారా, పరలోకములో మీకును యజ మానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు ధర్మాను సార మైనదియు మీ దాసులయెడల చేయుడి.
Yajamaanulaaraa, paralokamulo meekunu yaja maanudunnaadani yerigi, nyaayamainadiyu dharmaanu saara mainadiyu mee daasulayedala cheyudi.
Colossians 4:1 in English
- King James Version (KJV)
- Masters, give unto [your] servants that which is just and equal; knowing that ye also have a Master in heaven.
- World English Bible (WEB)
- Masters, give to your servants that which is just and equal, knowing that you also have a Master in heaven.
- American Standard Version (ASV)
- Masters, render unto your servants that which is just and equal; knowing that ye also have a Master in heaven.
- Bible in Basic English (BBE)
- Masters, give your servants what is right and equal, conscious that you have a Master in heaven.
- Darby Translation (DBY)
- Masters, give to bondmen what is just and fair, knowing that ye also have a Master in [the] heavens.
- Webster's Bible (WBS)
- Masters, give to [your] servants that which is just and equal; knowing that ye also have a Master in heaven.
- Young's Literal Translation (YLT)
- The masters! that which is righteous and equal to the servants give ye, having known that ye also have a Master in the heavens.
Read in context
- 1యజమానులారా, పరలోకములో మీకును యజ మానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు ధర్మాను సార మైనదియు మీ దాసులయెడల చేయుడి.
- 2ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.
- 3మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే
Cross references
- Ephesians 6:8–20 ఎఫెసీయులకు 6:8–20దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు. యజమాను లారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోక మందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి. తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేనినిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు దానినిగూర్చి నేను మాట లాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
- Deuteronomy 24:14–15 ద్వితీయోపదేశకాండము 24:14–15నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామము లలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను. సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్య వలెను. వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టు కొనియుండును. వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టు నేమో అది నీకు పాపమగును.
- Revelation 17:14 ప్రకటన 17:14వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
- James 2:13 యాకోబు 2:13కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.
- Luke 16:1–13 లూకా 16:1–13మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి నిన్నుగూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను. ఆ గృహనిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహనిర్వాహ కత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహనిర్వాహకత్వపు పనినుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని, తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను. వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసి కొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను. తరువాత వాడు నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు. వానితోనీవు నీ చీటి తీసికొని యెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను. అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విష యములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమిం చును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింప లేరని చెప్పెను.
- Matthew 24:48–51 మత్తయి 24:48–51అయితే దుష్టుడైన యొక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
- James 5:4 యాకోబు 5:4ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
- Ecclesiastes 5:8 ప్రసంగి 5:8ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కన బడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా నున్నాడు.
- Leviticus 25:39–43 లేవీయకాండము 25:39–43నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు. వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను. ఏల యనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు; నీ దేవునికి భయపడి అట్టివానిని కఠిన ముగా చూడకుము.
- Revelation 19:16 ప్రకటన 19:16రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.
- Luke 19:15 లూకా 19:15అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.
- Malachi 3:5 మలాకీ 3:5తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారులమీదను అప్ర మాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయ ములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢ ముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Original words (Greek)
- Masters · G2962κύριος kýrios
- give · G3930παρέχω paréchō
- unto · G1401δοῦλος doûlos
- servants · G1401δοῦλος doûlos
- just · G1342δίκαιος díkaios
- and · G2532καί kaí
- equal · G2471ἰσότης isótēs
- knowing · G1492εἴδω eídō
- that · G3754ὅτι hóti
- ye · G5210ὑμεῖς hymeîs
- also · G2532καί kaí
- have · G2192ἔχω échō
- Master · G2962κύριος kýrios
- in · G1722ἐν en
- heaven · G3772οὐρανός ouranós