Luke · chapter 16 · verse 1
Luke 16:1 in Telugu
మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా
Mariyu aayana tana shishyulato itlanenu oka dhanavantuniyodda oka gruhanirvaahakudundenu. Vaadatani aastini paaducheyuchunnaadani ataniyodda vaani meeda neramu mopabadagaa
Luke 16:1 in English
- King James Version (KJV)
- And he said also unto his disciples, There was a certain rich man, which had a steward; and the same was accused unto him that he had wasted his goods.
- World English Bible (WEB)
- He also said to his disciples, “There was a certain rich man who had a manager. An accusation was made to him that this man was wasting his possessions.
- American Standard Version (ASV)
- And he said also unto the disciples, There was a certain rich man, who had a steward; and the same was accused unto him that he was wasting his goods.
- Bible in Basic English (BBE)
- And another time he said to the disciples, There was a certain man of great wealth who had a servant; and it was said to him that this servant was wasting his goods.
- Darby Translation (DBY)
- And he said also to [his] disciples, There was a certain rich man who had a steward, and he was accused to him as wasting his goods.
- Webster's Bible (WBS)
- And he said also to his disciples, There was a certain rich man who had a steward; and the same was accused to him that he had wasted his goods.
- Young's Literal Translation (YLT)
- And he said also unto his disciples, 'A certain man was rich, who had a steward, and he was accused to him as scattering his goods;
Read in context
- 1మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా
- 2అతడు వాని పిలిపించి నిన్నుగూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను.
- 3ఆ గృహనిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహనిర్వాహ కత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను.
Cross references
- 1 Peter 4:10 1 పేతురు 4:10దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.
- Matthew 25:14–30 మత్తయి 25:14–30(పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్ప గించినట్లుండును. అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపా దించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించి తివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చిఅయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియు గాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమా నుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగు దును గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.
- 1 Corinthians 4:1–2 1 కొరింథీయులకు 4:1–2ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.
- Luke 12:42 లూకా 12:42ప్రభువు ఇట్లనెను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?
- James 4:3 యాకోబు 4:3మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.
- Titus 1:7 తీతుకు 1:7ఎందు కనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక,
- Luke 15:13 లూకా 15:13కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.
- Luke 15:30 లూకా 15:30అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.
- Matthew 18:23–24 మత్తయి 18:23–24కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను.
- Luke 19:20 లూకా 19:20అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;
- Proverbs 18:9 సామెతలు 18:9పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు.
- Hosea 2:8 హోషేయ 2:8దానికి ధాన్య ద్రాక్షారసతైలము లను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను.