Daniel · chapter 5 · verse 9
Daniel 5:9 in Telugu
అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన యధిపతులు విస్మయమొందునట్లుగా ముఖవికారముగలవాడా యెను.
Anduku raajagu belshassaru migula bhayaakraantudai tana yadhipatulu vismayamondunatlugaa mukhavikaaramugalavaadaa yenu.
Daniel 5:9 in English
- King James Version (KJV)
- Then was king Belshazzar greatly troubled, and his countenance was changed in him, and his lords were astonied.
- World English Bible (WEB)
- Then King Belshazzar was greatly troubled, and his face was changed in him, and his lords were perplexed.
- American Standard Version (ASV)
- Then was king Belshazzar greatly troubled, and his countenance was changed in him, and his lords were perplexed.
- Bible in Basic English (BBE)
- Then King Belshazzar was greatly troubled and the colour went from his face, and his lords were at a loss.
- Darby Translation (DBY)
- Then was king Belshazzar greatly troubled, and his countenance was changed in him, and his nobles were confounded.
- Webster's Bible (WBS)
- Then was the king Belshazzar greatly troubled, and his countenance was changed in him, and his lords were astonished.
- Young's Literal Translation (YLT)
- then the king Belshazzar is greatly troubled, and his countenance is changing in him, and his great men are perplexed.
Read in context
- 7రాజు గారడీ విద్యగల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను - ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును.
- 8రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుటయైనను వారివల్ల కాకపోయెను.
- 9అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన యధిపతులు విస్మయమొందునట్లుగా ముఖవికారముగలవాడా యెను.
- 10రాజునకును అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండ నిమ్ము.
- 11నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకున గాండ్రకును గారడీవిద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని నియమించెను.
Cross references
- Daniel 5:6 దానియేలు 5:6అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.
- Daniel 2:1 దానియేలు 2:1నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సర మున కలలు కనెను. అందునుగురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను.
- Isaiah 21:2–4 యెషయా 21:2–4కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను గ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.
- Isaiah 13:6–8 యెషయా 13:6–8యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును. అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
- Jeremiah 6:24 యిర్మీయా 6:24దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగు చున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.
- Psalm 48:6 కీర్తనలు 48:6వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను.
- Psalm 18:14 కీర్తనలు 18:14ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుమెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను.
- Job 18:11–14 యోబు 18:11–14నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
- Revelation 6:15 ప్రకటన 6:15భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
- Jeremiah 30:6 యిర్మీయా 30:6మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?
- Matthew 2:3 మత్తయి 2:3హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
- Daniel 10:8 దానియేలు 10:8నేను ఒంటరినై యా గొప్ప దర్శ నమును చూచితిని; చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు.