Jeremiah · chapter 30 · verse 6
Jeremiah 30:6 in Telugu
మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?
Meeru vichaarinchi telisikonudi; purushulu prasooti vedanato pillalanu kanduraa? Prasavavedanapadu streelavale purushulandarunu nadumumeeda chetulunchukonutayu, vaari mukhamulu tellabaarutayu naaku kanabaduchunnademi?
Jeremiah 30:6 in English
- King James Version (KJV)
- Ask ye now, and see whether a man doth travail with child? wherefore do I see every man with his hands on his loins, as a woman in travail, and all faces are turned into paleness?
- World English Bible (WEB)
- Ask now, and see whether a man travails with child. Why do I see every man with his hands on his waist, as a woman in travail, and all faces are turned pale?
- American Standard Version (ASV)
- Ask ye now, and see whether a man doth travail with child: wherefore do I see every man with his hands on his loins, as a woman in travail, and all faces are turned into paleness?
- Bible in Basic English (BBE)
- Put the question and see if it is possible for a man to have birth-pains: why do I see every man with his hands gripping his sides, as a woman does when the pains of birth are on her, and all faces are turned green?
- Darby Translation (DBY)
- Ask ye now, and see, whether a male doth travail with child? Wherefore do I see every man with his hands on his loins, as a woman in travail; and all faces are turned into paleness?
- Webster's Bible (WBS)
- Ask ye now, and see whether a man doth travail with child? Why do I see every man with his hands on his loins, as a woman in travail, and all faces are turned into paleness?
- Young's Literal Translation (YLT)
- Ask, I pray you, and see, is a male bringing forth? Wherefore have I seen every man, His hands on his loins, as a travailing woman, And all faces have been turned to paleness?
Read in context
- 4యెహోవా ఇశ్రాయేలువారిని గూర్చియు యూదా వారినిగూర్చియు సెలవిచ్చినమాటలివి.
- 5యెహోవా యిట్లనెను సమాధానములేని కాలమున భీతిచేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము.
- 6మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?
- 7అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.
- 8సెన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు నీకున్న కాడి నీ మెడనుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించుకొనరు గాని
Cross references
- Nahum 2:10 నహూము 2:10అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.
- Joel 2:6 యోవేలు 2:6వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖములు తెల్లబారును.
- Jeremiah 4:31 యిర్మీయా 4:31ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్చిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు వినబడుచున్నది.
- Isaiah 21:3 యెషయా 21:3కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.
- Psalm 48:6 కీర్తనలు 48:6వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను.
- Hosea 13:13 హోషేయ 13:13ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనపుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు.
- Jeremiah 6:24 యిర్మీయా 6:24దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగు చున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.
- Jeremiah 22:23 యిర్మీయా 22:23లెబానోను నివాసినీ, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదనవంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలువేయుదువు గదా!
- 1 Thessalonians 5:3 1 థెస్సలొనీకయులకు 5:3లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
- Isaiah 29:22 యెషయా 29:22అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెల విచ్చుచున్నాడు ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.
- Jeremiah 49:24 యిర్మీయా 49:24దమస్కు బలహీనమాయెను. పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను.
- Isaiah 13:6–9 యెషయా 13:6–9యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును. అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.