Deuteronomy · chapter 1 · verse 11
Deuteronomy 1:11 in Telugu
మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక.
Mee pitarula devudaina yehovaa mee janasankhyanu veyyi retlu ekkuvachesi, taanu meeto cheppinatlu mimmunu aasheervadinchunugaaka.
Deuteronomy 1:11 in English
- King James Version (KJV)
- (The LORD God of your fathers make you a thousand times so many more as ye [are], and bless you, as he hath promised you!)
- World English Bible (WEB)
- May the LORD, the God of your fathers, make you a thousand times as many as you are and bless you, as he has promised you!
- American Standard Version (ASV)
- Jehovah, the God of your fathers, make you a thousand times as many as ye are, and bless you, as he hath promised you!
- Bible in Basic English (BBE)
- May the Lord, the God of your fathers, make you a thousand times greater in number than you are, and give you his blessing as he has said!
- Darby Translation (DBY)
- Jehovah, the God of your fathers, make you a thousand times so many more as ye are, and bless you as he hath said unto you!
- Webster's Bible (WBS)
- (The LORD God of your fathers make you a thousand times so many more as ye [are] , and bless you, as he hath promised you!)
- Young's Literal Translation (YLT)
- Jehovah, God of your fathers, is adding to you, as ye [are], a thousand times, and doth bless you as He hath spoken to you.
Read in context
- 9అప్పుడు నేనుఒంటరిగా మిమ్మును భరింపలేను.
- 10మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప జేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు.
- 11మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక.
- 12నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను?
- 13జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రము లలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా
Cross references
- Psalm 115:14 కీర్తనలు 115:14యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
- Genesis 22:17 ఆదికాండము 22:17నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.
- Numbers 6:27 సంఖ్యాకాండము 6:27అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.
- Genesis 26:4 ఆదికాండము 26:4ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.
- Genesis 15:5 ఆదికాండము 15:5మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
- 2 Samuel 24:3 2 సమూయేలు 24:3యోవాబుజనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికి యుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలిన వాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెననెను.
- Genesis 49:25 ఆదికాండము 49:25క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును
- Exodus 32:13 నిర్గమకాండము 32:13నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితోఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.
- Numbers 22:12 సంఖ్యాకాండము 22:12అందుకు దేవుడునీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.
- 1 Chronicles 21:3 1 దినవృత్తాంతములు 21:3అందుకు యోవాబురాజా నా యేలిన వాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక;వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవిచేసెను.