Deuteronomy · chapter 10 · verse 4
Deuteronomy 10:4 in Telugu
ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి
Aa samaajadinamuna aa kondameeda agni madhyanundi taanu meeto palikina padi aajnyalanu munupu vraasinattu yehovaa aa palakalameeda vraasenu. Yehovaa vaatini naakichchina taruvaata nenu tirigi konda digivachchi
Deuteronomy 10:4 in English
- King James Version (KJV)
- And he wrote on the tables, according to the first writing, the ten commandments, which the LORD spake unto you in the mount out of the midst of the fire in the day of the assembly: and the LORD gave them unto me.
- World English Bible (WEB)
- He wrote on the tablets, according to the first writing, the ten commandments, which the LORD spoke to you on the mountain out of the middle of the fire in the day of the assembly; and the LORD gave them to me.
- American Standard Version (ASV)
- And he wrote on the tables, according to the first writing, the ten commandments, which Jehovah spake unto you in the mount out of the midst of the fire in the day of the assembly: and Jehovah gave them unto me.
- Bible in Basic English (BBE)
- And he put on the stones, as in the first writing, the ten rules which the Lord gave you on the mountain out of the fire on the day of the great meeting: and the Lord gave the stones to me.
- Darby Translation (DBY)
- And he wrote on the tables, as the first writing, the ten words which Jehovah spoke unto you on the mountain, from the midst of the fire, on the day of the assembly, and Jehovah gave them unto me.
- Webster's Bible (WBS)
- And he wrote on the tables according to the first writing, the ten commandments, which the LORD spoke to you in the mount, from the midst of the fire, in the day of the assembly: and the LORD gave them to me.
- Young's Literal Translation (YLT)
- 'And He writeth on the tables, according to the first writing, the Ten Matters, which Jehovah hath spoken unto you in the mount, out of the midst of the fire, in the day of the assembly, and Jehovah giveth them unto me,
Read in context
- 2నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను.
- 3కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ యెక్కితిని.
- 4ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి
- 5నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.
- 6ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను.
Cross references
- Deuteronomy 9:10 ద్వితీయోపదేశకాండము 9:10అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. మీరు కూడివచ్చిన దినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నియు వాటిమీద ఉండెను.
- Exodus 34:28 నిర్గమకాండము 34:28అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.
- Deuteronomy 4:11–15 ద్వితీయోపదేశకాండము 4:11–15అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశమువరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసెను. అప్పుడు మీరు నదిదాటి స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు అనుసరింప వలసిన కట్టడ లను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నా కాజ్ఞాపించెను. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూప మును చూడలేదు.
- Deuteronomy 18:16 ద్వితీయోపదేశకాండము 18:16ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయ మున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.
- Hebrews 12:18–19 హెబ్రీయులకు 12:18–19స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుపానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక,
- Exodus 19:17–18 నిర్గమకాండము 19:17–18దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెము లోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
- Exodus 20:1–17 నిర్గమకాండము 20:1–17దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు కరుణించు వాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.
- Deuteronomy 5:4–26 ద్వితీయోపదేశకాండము 5:4–26యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ యెక్కలేదు. గనుక యెహోవామాట మీకు తెలియ జేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి యుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను. దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు; వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవాయగు నేను రోషముగల దేవు డను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారి విషయ ములో వేయితరములవరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థ ముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిద యైనను నీ పశువులలో ఏదై నను నీ యిండ్లలోనున్న పర దేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందు చేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగు వాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసుని నైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిద నైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్యనుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటిమధ్యనుండి ఆ స్వరమును విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులును మీ పెద్దలును నాయొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్య మును మాకు చూపించెను. అగ్నిమధ్యనుండి ఆయన స్వర మును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రదుకుదురని నేడు తెలిసికొంటిమి. కాబట్టి మేము చావనేల? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును; మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినినయెడల చని పోదుము. మావలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవు డైన దేవుని స్వరము అగ్ని మధ్యనుండి పలుకుట విని బ్రదికెను?
Original words (Hebrew)
- wrote · H3789כָּתַב kâthab
- tables · H3871לוּחַ lûwach
- first · H7223רִאשׁוֹן riʼshôwn
- writing · H4385מִכְתָּב miktâb
- ten · H6235עֶשֶׂר ʻeser
- commandments · H1697דָּבָר dâbâr
- spake · H1696דָבַר dâbar
- mount · H2022הַר har
- midst · H8432תָּוֶךְ tâvek
- fire · H784אֵשׁ ʼêsh
- day · H3117יוֹם yôwm
- assembly · H6951קָהָל qâhâl
- gave · H5414נָתַן nâthan