Deuteronomy · chapter 11 · verse 28
Deuteronomy 11:28 in Telugu
నేడు నేను మికాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుస రించిన యెడల శాపమును మీకు కలుగును.
Nedu nenu mikaajnyaapinchu maargamunu vidichi meererugani yitara devatalanu anusa rinchina yedala shaapamunu meeku kalugunu.
Deuteronomy 11:28 in English
- King James Version (KJV)
- And a curse, if ye will not obey the commandments of the LORD your God, but turn aside out of the way which I command you this day, to go after other gods, which ye have not known.
- World English Bible (WEB)
- and the curse, if you do not listen to the commandments of the LORD your God, but turn away out of the way which I command you today, to go after other gods which you have not known.
- American Standard Version (ASV)
- and the curse, if ye shall not hearken unto the commandments of Jehovah your God, but turn aside out of the way which I command you this day, to go after other gods, which ye have not known.
- Bible in Basic English (BBE)
- And the curse if you do not give ear to the orders of the Lord your God, but let yourselves be turned from the way which I have put before you this day, and go after other gods which are not yours.
- Darby Translation (DBY)
- and a curse, if ye will not obey the commandments of Jehovah your God, but turn aside out of the way which I command you this day, to go after other gods which ye have not known.
- Webster's Bible (WBS)
- And a curse, if ye will not obey the commandments of the LORD your God, but turn aside from the way which I command you this day, to go after other gods which ye have not known.
- Young's Literal Translation (YLT)
- and the reviling, if ye do not hearken unto the commands of Jehovah your God, and have turned aside out of the way which I am commanding you to-day, to go after other gods which ye have not known.
Read in context
- 26చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.
- 27నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక
- 28నేడు నేను మికాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుస రించిన యెడల శాపమును మీకు కలుగును.
- 29కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.
- 30అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.
Cross references
- Romans 2:8–9 రోమీయులకు 2:8–9అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.
- Deuteronomy 28:15–68 ద్వితీయోపదేశకాండము 28:15–68నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు; నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును; నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును; నీవు లోపలికి వచ్చునప్పుడు శపింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడు దువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును. యెహోవా నీ దేశపు వర్ష మును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గ మున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్ట బడుదువు. నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టు చేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు. వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువు లాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించు వాడెవ డును లేకపోవును, స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు. నీ యెద్దు నీ కన్నులయెదుట వధింప బడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొని పోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు. నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెఱ్ఱియెత్తును. యెహోవా నీ అరకాలు మొదలు కొని నీ నడినెత్తివరకు మోకాళ్లమీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నిన్నును నీవు నీమీద నియమించు కొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును. కుమా రులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్ట బడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు. నీవు నాశనము చేయబడువరకు ఈ శాపము లన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టు కొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోను వస్త్ర హీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు. యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూరముఖము కలిగి వృద్ధులను ¸యౌవనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పిం చును. నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొల ముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱె మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమం దంతటను నీ గ్రామములన్ని టిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మను ష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామము లన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలిన దేమియు ఉండదు. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమా రముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్ల లను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును. నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాల ముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయ బడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశనక్షత్రములవలె విస్తారములైన మీరు, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలి యుందురు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయు టకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహ రించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు. దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును. నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ జూపు కొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.
- Galatians 3:10 గలతీయులకు 3:10ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగాధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియుచేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
- Isaiah 1:20 యెషయా 1:20సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.
- Deuteronomy 29:19–28 ద్వితీయోపదేశకాండము 29:19–28అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయ బడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును. ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపము లన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపర చును. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు. మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను. యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.
- Matthew 25:41 మత్తయి 25:41అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచిశపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
- Isaiah 3:11 యెషయా 3:11దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
- Leviticus 26:14–32 లేవీయకాండము 26:14–32మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను, నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు; నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు. ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను. మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను. మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను. మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల నేనుకూడ మీకు విరోధ ముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను. మీమీదికి ఖడ్గమును రప్పించె దను; అది నా నిబంధనవిషయమై ప్రతి దండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింప బడెదరు. నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పునమీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు. నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను. నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణ ములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడు చేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రాణింపను. నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.
Original words (Hebrew)
- curse · H7045קְלָלָה qᵉlâlâh
- obey · H8085שָׁמַע shâmaʻ
- commandments · H4687מִצְוָה mitsvâh
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- aside · H5493סוּר çûwr
- way · H1870דֶּרֶךְ derek
- command · H6680צָוָה tsâvâh
- day · H3117יוֹם yôwm
- go · H3212יָלַךְ yâlak
- after · H310אַחַר ʼachar
- other · H312אַחֵר ʼachêr
- gods · H430אֱלֹהִים ʼĕlôhîym
- known · H3045יָדַע yâdaʻ