Deuteronomy · chapter 21 · verse 21
Deuteronomy 21:21 in Telugu
అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.
Appudu oori prajalandaru raallato atani chaavagottavalenu. Atlu aa chedutanamunu nee madhyanundi pariharinchuduvu. Appudu ishraayeleeyulandaru vini bhayapaduduru.
Deuteronomy 21:21 in English
- King James Version (KJV)
- And all the men of his city shall stone him with stones, that he die: so shalt thou put evil away from among you; and all Israel shall hear, and fear.
- World English Bible (WEB)
- All the men of his city shall stone him to death with stones. So you shall remove the evil from among you. All Israel shall hear, and fear.
- American Standard Version (ASV)
- And all the men of his city shall stone him to death with stones: so shalt thou put away the evil from the midst of thee; and all Israel shall hear, and fear.
- Bible in Basic English (BBE)
- Then he is to be stoned to death by all the men of the town: so you are to put away the evil from among you; and all Israel, hearing of it, will be full of fear.
- Darby Translation (DBY)
- And all the men of his city shall stone him with stones, that he die. And thou shalt put evil away from thy midst; and all Israel shall hear and fear.
- Webster's Bible (WBS)
- And all the men of his city shall stone him with stones, that he may die: so shalt thou remove evil from among you, and all Israel shall hear, and fear.
- Young's Literal Translation (YLT)
- and all the men of his city have stoned him with stones, and he hath died, and thou hast put away the evil out of thy midst, and all Israel do hear and fear.
Read in context
- 19అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొని వచ్చి
- 20మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగ బడి యున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్ప వలెను.
- 21అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.
- 22మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల
- 23అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.
Cross references
- Deuteronomy 19:19–20 ద్వితీయోపదేశకాండము 19:19–20అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతన మును పరిహరించుదురు. మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.
- Deuteronomy 13:10–11 ద్వితీయోపదేశకాండము 13:10–11రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములో నుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.
- Leviticus 24:16 లేవీయకాండము 24:16యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
- Deuteronomy 13:5 ద్వితీయోపదేశకాండము 13:5నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవు డైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త కేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
- Deuteronomy 22:21 ద్వితీయోపదేశకాండము 22:21వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏల యనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రా యేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడు తనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు.
- Deuteronomy 22:24 ద్వితీయోపదేశకాండము 22:24ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.
- Deuteronomy 17:5 ద్వితీయోపదేశకాండము 17:5ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను.