Deuteronomy · chapter 23 · verse 18
Deuteronomy 23:18 in Telugu
పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవు డైన యెహోవాకు హేయములు.
Padupusommunegaani kukka viluvanegaani mrokkubadigaa nee devudaina yehovaa yintiki tekoodadu. Elayanagaa aa rendunu nee devu daina yehovaaku heyamulu.
Deuteronomy 23:18 in English
- King James Version (KJV)
- Thou shalt not bring the hire of a whore, or the price of a dog, into the house of the LORD thy God for any vow: for even both these [are] abomination unto the LORD thy God.
- World English Bible (WEB)
- You shall not bring the hire of a prostitute, or the wages of a male prostitute, into the house of the LORD your God for any vow; for both of these are an abomination to the LORD your God.
- American Standard Version (ASV)
- Thou shalt not bring the hire of a harlot, or the wages of a dog, into the house of Jehovah thy God for any vow: for even both these are an abomination unto Jehovah thy God.
- Bible in Basic English (BBE)
- Do not take into the house of the Lord your God, as an offering for an oath, the price of a loose woman or the money given to one used for sex purposes in the worship of the gods: for these two things are disgusting to the Lord your God.
- Darby Translation (DBY)
- Thou shalt not bring the hire of a harlot, or the price of a dog, into the house of Jehovah thy God for any vow; for even both these are an abomination to Jehovah thy God.
- Webster's Bible (WBS)
- Thou shalt not bring the hire of a harlot, or the price of a dog into the house of the LORD thy God for any vow: for even both these [are] abomination to the LORD thy God.
- Young's Literal Translation (YLT)
- thou dost not bring a gift of a whore, or a price of a dog, into the house of Jehovah thy God, for any vow; for the abomination of Jehovah thy God [are] even both of them.
Read in context
- 16అతడు తన యిష్టప్రకారము నీ గ్రామములలో ఒకదాని యందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను; నీవు వాని బాధింపకూడదు.
- 17ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగా ఉండ కూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుష గామిగా ఉండకూడదు.
- 18పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవు డైన యెహోవాకు హేయములు.
- 19నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయ బడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు.
- 20అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.
Cross references
- Philippians 3:2 ఫిలిప్పీయులకు 3:2కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.
- Revelation 22:15 ప్రకటన 22:15కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
- Matthew 7:6 మత్తయి 7:6పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
- Ezekiel 16:33 యెహెజ్కేలు 16:33నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.
- Isaiah 61:8 యెషయా 61:8ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్యనిబంధన చేయుదును.
- Leviticus 18:22 లేవీయకాండము 18:22స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము.
- Psalm 5:4–6 కీర్తనలు 5:4–6నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
- Habakkuk 1:13 హబక్కూకు 1:13నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?
- Deuteronomy 23:21 ద్వితీయోపదేశకాండము 23:21నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరు వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయ కూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.
- 2 Peter 2:22 2 పేతురు 2:22కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.
- Isaiah 56:10–11 యెషయా 56:10–11వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు.
- Psalm 22:16 కీర్తనలు 22:16కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.