Deuteronomy · chapter 28 · verse 26
Deuteronomy 28:26 in Telugu
నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.
Nee kale baramu sakalamaina aakaashapakshulakunu bhoojantuvulakunu aahaaramagunu; vaatini bedarinchu vaadevadunu undadu.
Deuteronomy 28:26 in English
- King James Version (KJV)
- And thy carcase shall be meat unto all fowls of the air, and unto the beasts of the earth, and no man shall fray [them] away.
- World English Bible (WEB)
- Your dead bodies will be food to all birds of the sky, and to the animals of the earth; and there will be no one to frighten them away.
- American Standard Version (ASV)
- And thy dead body shall be food unto all birds of the heavens, and unto the beasts of the earth; and there shall be none to frighten them away.
- Bible in Basic English (BBE)
- Your bodies will be meat for all the birds of the air and the beasts of the earth; there will be no one to send them away.
- Darby Translation (DBY)
- And thy carcase shall be meat unto all the fowl of the air, and unto the beasts of the earth, and there shall be no man to scare them away.
- Webster's Bible (WBS)
- And thy carcass shall be food to all fowls of the air, and to the beasts of the earth, and no man shall drive [them] away.
- Young's Literal Translation (YLT)
- and thy carcase hath been for food to every fowl of the heavens, and to the beast of the earth, and there is none causing trembling.
Read in context
- 24యెహోవా నీ దేశపు వర్ష మును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును.
- 25యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గ మున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్ట బడుదువు.
- 26నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.
- 27యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టు చేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.
- 28వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును.
Cross references
- Jeremiah 34:20 యిర్మీయా 34:20వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతికిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును.
- Jeremiah 16:4 యిర్మీయా 16:4వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.
- Jeremiah 7:33 యిర్మీయా 7:33ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.
- Jeremiah 19:7 యిర్మీయా 19:7తమ శత్రువుల యెదుట ఖడ్గముచేతను, తమ ప్రాణములనుతీయ వెదకువారిచేతను వారిని కూలజేసి, ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళే బరములను ఇచ్చి, ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను.
- Jeremiah 8:1 యిర్మీయా 8:1యెహోవా వాక్కు ఆ కాలమున శత్రువులు యూదారాజుల యెముకలను అధిపతుల యెముకలను యాజకుల యెముకలను ప్రవక్తల యెముకలను యెరూషలేము నివాసుల యెముకలను సమాధుల లోనుండి వెలుపలికి తీసి
- Ezekiel 39:17–20 యెహెజ్కేలు 39:17–20నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా సకలజాతుల పక్షులకును భూమృగముల కన్ని టికిని యీ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి; ఇశ్రాయేలీయుల పర్వతములమీద నొక గొప్ప బలి జరు గును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు; బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్లేళ్ల యొక్కయు గొఱ్ఱెపిల్లల యొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింప బోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Isaiah 34:3 యెషయా 34:3వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును.
- 1 Samuel 17:44–46 1 సమూయేలు 17:44–46నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగముల కును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీ యుడు దావీదుతో అనగా దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును.
- Psalm 79:1–3 కీర్తనలు 79:1–3దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి యున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశపక్షులకు ఎర గాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి యున్నారు. ఒకడు నీళ్లుపోసినట్లు యెరూషలేముచుట్టు వారి రక్తము పారబోసియున్నారు వారిని పాతిపెట్టువారెవరును లేరు.