Isaiah · chapter 34 · verse 3
Isaiah 34:3 in Telugu
వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును.
Vaarilo champabadinavaaru bayata veyabadedaru vaari shavamulu kampukottunu vaari raktamuvalana kondalu karagipovunu.
Isaiah 34:3 in English
- King James Version (KJV)
- Their slain also shall be cast out, and their stink shall come up out of their carcases, and the mountains shall be melted with their blood.
- World English Bible (WEB)
- Their slain will also be cast out, and the stench of their dead bodies will come up. The mountains will melt in their blood.
- American Standard Version (ASV)
- Their slain also shall be cast out, and the stench of their dead bodies shall come up; and the mountains shall be melted with their blood.
- Bible in Basic English (BBE)
- Their dead bodies will be thick on the face of the earth, and their smell will come up, and the mountains will be flowing with their blood, and all the hills will come to nothing.
- Darby Translation (DBY)
- And their slain shall be cast out, and their stink shall come up from their carcases, and the mountains shall be melted with their blood.
- Webster's Bible (WBS)
- Their slain also shall be cast out, and their ill smell shall come up from their carcases, and the mountains shall be melted with their blood.
- Young's Literal Translation (YLT)
- And their wounded are cast out, And their carcases cause their stench to ascend, And melted have been mountains from their blood.
Read in context
- 1రాష్ట్రములారా, నాయొద్దకు వచ్చి వినుడి జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక.
- 2యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చు చున్నది వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చు చున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను.
- 3వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును.
- 4ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును.
- 5నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును
Cross references
- Joel 2:20 యోవేలు 2:20మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పార దోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లువాసన కొట్టును.
- Isaiah 34:7 యెషయా 34:7వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె లును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది.
- Ezekiel 39:4 యెహెజ్కేలు 39:4నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇశ్రాయేలు పర్వతములమీద కూలుదురు, నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను.
- 2 Kings 9:35–37 2 రాజులు 9:35–37వారు దానిని పాతిపెట్ట బోయిరి; అయితే దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెనుఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున యిది జరిగెను.
- Amos 4:10 ఆమోసు 4:10మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని; మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కు నంతగా మీ ¸యౌవనులను ఖడ్గముచేత హతముచేయించి మీ గుఱ్ఱములను కొల్లపెట్టించితిని; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.
- Ezekiel 39:11 యెహెజ్కేలు 39:11ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను; గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతి పెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును, ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు.
- Jeremiah 22:19 యిర్మీయా 22:19అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.
- Ezekiel 14:19 యెహెజ్కేలు 14:19అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించినయెడల
- Isaiah 14:19–20 యెషయా 14:19–20నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.
- Ezekiel 38:22 యెహెజ్కేలు 38:22తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడ గండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.
- Revelation 16:3–4 ప్రకటన 16:3–4రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందు వలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను.
- Revelation 14:20 ప్రకటన 14:20ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.