Deuteronomy · chapter 3 · verse 28
Deuteronomy 3:28 in Telugu
యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీన పరచుకొనచేయును.
Yehoshuvaku aajnyayichchi atani dhairyaparachi drudhaparachumu. Atadu ee prajalanu ventabettukoni nadidaati neevu choodabovu deshamunu vaarini svaadheena parachukonacheyunu.
Deuteronomy 3:28 in English
- King James Version (KJV)
- But charge Joshua, and encourage him, and strengthen him: for he shall go over before this people, and he shall cause them to inherit the land which thou shalt see.
- World English Bible (WEB)
- But commission Joshua, and encourage him, and strengthen him; for he shall go over before this people, and he shall cause them to inherit the land which you shall see.”
- American Standard Version (ASV)
- But charge Joshua, and encourage him, and strengthen him; for he shall go over before this people, and he shall cause them to inherit the land which thou shalt see.
- Bible in Basic English (BBE)
- But give my orders to Joshua, comforting him and making him strong; for he is to go over Jordan at the head of this people, and he will give them this land which you will see for their heritage.
- Darby Translation (DBY)
- But charge Joshua, and encourage him and strengthen him; for he shall go over before this people, and he shall put them in possession of the land which thou shalt see.
- Webster's Bible (WBS)
- But charge Joshua, and encourage him, and strengthen him: for he shall go over before this people, and he shall cause them to inherit the land which thou shalt see.
- Young's Literal Translation (YLT)
- and charge Jehoshua, and strengthen him, and harden him, for he doth pass over before this people, and he doth cause them to inherit the land which thou seest.
Read in context
- 26యెహోవా మిమ్మును బట్టి నామీద కోప పడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెనుచాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు.
- 27నీవు ఈ యొర్దానును దాట కూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.
- 28యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నదిదాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీన పరచుకొనచేయును.
- 29అప్పుడు మనము బేత్పయోరు యెదుటనున్న లోయలో దిగియుంటిమి.
Cross references
- Deuteronomy 31:3 ద్వితీయోపదేశకాండము 31:3నీ దేవు డైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశ మును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి యున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.
- Deuteronomy 31:23 ద్వితీయోపదేశకాండము 31:23మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషు వకు ఈలాగు సెలవిచ్చెనునీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై యుందును.
- Deuteronomy 1:38 ద్వితీయోపదేశకాండము 1:38అతడు ఇశ్రా యేలీయులు దాని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము.
- Deuteronomy 31:7 ద్వితీయోపదేశకాండము 31:7మరియు మోషే యెహోషువను పిలిచినీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణముచేసిన దేశ మునకు నీవు వీరితోకూడ పోయి దానిని వారికి స్వాధీన పరచవలెను.
- Acts 7:45 అపొస్తలుల కార్యములు 7:45మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనిన వారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను.
- Numbers 27:18–23 సంఖ్యాకాండము 27:18–23అందుకు యెహోవా మోషేతో ఇట్లనెనునూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యి యుంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము; ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించి నట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువ బెట్టి అతనిమీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను.
- Joshua 3:7–17 యెహోషువ 3:7–17అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందు నని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను. మీరు యొర్దాను నీళ్లదరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞా పించుము. కాబట్టి యెహోషువమీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీ యులకు ఆజ్ఞాపించి వారితో యిట్లనెనుసర్వలోక నాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు. కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రా యేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి. సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజ కుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును. కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధన మందస మును మోయు యాజ కులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిర ముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.
- 1 Chronicles 28:9–10 1 దినవృత్తాంతములు 28:9–10సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.
- 1 Chronicles 22:11–16 1 దినవృత్తాంతములు 22:11–16నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక; నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయులమీద నీకు అధికారము దయచేయును గాక. యెహోవా ఇశ్రాయేలీయులనుగూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడిన యెడల నీవు వృద్ధిపొందుదువు; ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము; భయపడకుము దిగులుపడకుము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తార మైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రాను లను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక. మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసె పనివారును వడ్రవారును ఏవిధ మైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక.
- 2 Timothy 2:1–3 2 తిమోతికి 2:1–3నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము, క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము.
- John 1:17 యోహాను 1:17ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
- 2 Timothy 4:1–6 2 తిమోతికి 4:1–6దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అను కూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును. అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.