Psalms · chapter 18 · verse 10
Psalm 18:10 in Telugu
కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
Keroobumeeda ekki aayana yegiri vachchenu gaali rekkalameeda pratyakshamaayenu.
Psalm 18:10 in English
- King James Version (KJV)
- And he rode upon a cherub, and did fly: yea, he did fly upon the wings of the wind.
- World English Bible (WEB)
- He rode on a cherub, and flew. Yes, he soared on the wings of the wind.
- American Standard Version (ASV)
- And he rode upon a cherub, and did fly; Yea, he soared upon the wings of the wind.
- Bible in Basic English (BBE)
- And he went in flight through the air, seated on a storm-cloud: going quickly on the wings of the wind.
- Darby Translation (DBY)
- And he rode upon a cherub and did fly; yea, he flew fast upon the wings of the wind.
- Webster's Bible (WBS)
- And he rode upon a cherub, and flew; yes, he flew upon the wings of the wind.
- Young's Literal Translation (YLT)
- And He rideth on a cherub, and doth fly, And He flieth on wings of wind.
Read in context
- 8ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను
- 9నిప్పుకణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెనుఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మియుండెను.
- 10కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
- 11గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెనుజలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను.
- 12ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను.
Cross references
- Psalm 104:3 కీర్తనలు 104:3జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
- 2 Samuel 22:11–12 2 సమూయేలు 22:11–12కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను. గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను. గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను. నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
- Psalm 99:1 కీర్తనలు 99:1యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.
- Ezekiel 1:5–14 యెహెజ్కేలు 1:5–14దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలును గలవు. వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను. వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను. ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు. వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మయే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవు చుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగు చుండెను.
- Ezekiel 10:20–22 యెహెజ్కేలు 10:20–22కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని. ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను. మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.
- Psalm 80:1 కీర్తనలు 80:1ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.