Ecclesiastes · chapter 11 · verse 1
Ecclesiastes 11:1 in Telugu
నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినము లైన తరువాత అది నీకు కనబడును.
Nee aahaaramunu neellameeda veyumu, chaalaa dinamu laina taruvaata adi neeku kanabadunu.
Ecclesiastes 11:1 in English
- King James Version (KJV)
- Cast thy bread upon the waters: for thou shalt find it after many days.
- World English Bible (WEB)
- Cast your bread on the waters; for you shall find it after many days.
- American Standard Version (ASV)
- Cast thy bread upon the waters; for thou shalt find it after many days.
- Bible in Basic English (BBE)
- Put out your bread on the face of the waters; for after a long time it will come back to you again.
- Darby Translation (DBY)
- Cast thy bread upon the waters; for thou shalt find it after many days.
- Webster's Bible (WBS)
- Cast thy bread upon the waters: for thou shalt find it after many days.
- Young's Literal Translation (YLT)
- Send forth thy bread on the face of the waters, For in the multitude of the days thou dost find it.
Read in context
- 1నీ ఆహారమును నీళ్లమీద వేయుము, చాలా దినము లైన తరువాత అది నీకు కనబడును.
- 2ఏడుగురికిని ఎనమండు గురికిని భాగము పంచిపెట్టుము, భూమిమీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు.
- 3మేఘములు వర్షముతో నిండి యుండగా అవి భూమిమీద దాని పోయును; మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే యుండును.
Cross references
- Ecclesiastes 11:6 ప్రసంగి 11:6ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు.
- Proverbs 19:17 సామెతలు 19:17బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
- Matthew 10:42 మత్తయి 10:42మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
- Hebrews 6:10 హెబ్రీయులకు 6:10మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.
- 2 Corinthians 9:6 2 కొరింథీయులకు 9:6కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
- Isaiah 32:20 యెషయా 32:20సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.
- Psalm 41:1–2 కీర్తనలు 41:1–2బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.
- Galatians 6:8–10 గలతీయులకు 6:8–10ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేష ముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.
- Luke 14:14 లూకా 14:14నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.
- Psalm 126:5–6 కీర్తనలు 126:5–6కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.
- Isaiah 32:8 యెషయా 32:8ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
- Proverbs 11:18 సామెతలు 11:18భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.