Ecclesiastes · chapter 5 · verse 13
Ecclesiastes 5:13 in Telugu
సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించు కొనును.
Sooryuni krinda manassunaku aayaasakaramainadokati jaruguta nenu choochitini. Adedanagaa aastigalavaadu tana aastini daachipettukoni tanaku naashanamu teppinchu konunu.
Ecclesiastes 5:13 in English
- King James Version (KJV)
- There is a sore evil [which] I have seen under the sun, [namely], riches kept for the owners thereof to their hurt.
- World English Bible (WEB)
- There is a grievous evil which I have seen under the sun: wealth kept by its owner to his harm.
- American Standard Version (ASV)
- There is a grievous evil which I have seen under the sun, [namely], riches kept by the owner thereof to his hurt:
- Bible in Basic English (BBE)
- There is a great evil which I have seen under the sun — wealth kept by the owner to be his downfall.
- Darby Translation (DBY)
- There is a grievous evil that I have seen under the sun: riches kept for the owners thereof to their hurt;
- Webster's Bible (WBS)
- There is a grievous evil [which] I have seen under the sun, [namely] , riches kept for the owners of them to their hurt.
- Young's Literal Translation (YLT)
- There is a painful evil I have seen under the sun: wealth kept for its possessor, for his evil.
Read in context
- 11ఆస్తి యెక్కువైన యెడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు; కన్నులార చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తివలని ప్రయోజన మేమి?
- 12కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృధ్థిచేత నిద్రపట్టదు.
- 13సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించు కొనును.
- 14అయితే ఆ ఆస్తి దురదృష్టమువలన నశించి పోవును; అతడు పుత్రులుగలవాడైనను అతనిచేతిలో ఏమియు లేకపోవును.
- 15వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాసపడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు;
Cross references
- Ecclesiastes 6:1–2 ప్రసంగి 6:1–2సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువకాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది.
- Luke 18:22–23 లూకా 18:22–23యేసు వినినీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా
- Genesis 19:14 ఆదికాండము 19:14లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడ నైయున్న తన అల్లుళ్లతో మాటలాడిలెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవు చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.
- Luke 16:22–23 లూకా 16:22–23ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రా హామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి
- James 5:1–4 యాకోబు 5:1–4ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి. మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.
- Luke 12:16–21 లూకా 12:16–21మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను. దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.
- Proverbs 1:32 సామెతలు 1:32జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు.
- Proverbs 1:19 సామెతలు 1:19ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.
- Luke 16:19 లూకా 16:19ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.
- Ecclesiastes 4:8 ప్రసంగి 4:8ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడుసుఖమనునది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును.
- Isaiah 32:6–8 యెషయా 32:6–8మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
- Proverbs 11:24–25 సామెతలు 11:24–25వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును