Ephesians · chapter 2 · verse 21
Ephesians 2:21 in Telugu
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
Prati kattadamunu aayanalo chakkagaa amarchabadi, prabhuvunandu parishuddhamaina devaalaya magutaku vruddhiponduchunnadi.
Ephesians 2:21 in English
- King James Version (KJV)
- In whom all the building fitly framed together groweth unto an holy temple in the Lord:
- World English Bible (WEB)
- in whom the whole building, fitted together, grows into a holy temple in the Lord;
- American Standard Version (ASV)
- in whom each several building, fitly framed together, groweth into a holy temple in the Lord;
- Bible in Basic English (BBE)
- In whom all the building, rightly joined together, comes to be a holy house of God in the Lord;
- Darby Translation (DBY)
- in whom all [the] building fitted together increases to a holy temple in the Lord;
- Webster's Bible (WBS)
- In whom all the building fitly framed together, groweth to a holy temple in the Lord:
- Young's Literal Translation (YLT)
- in whom all the building fitly framed together doth increase to an holy sanctuary in the Lord,
Read in context
- 19కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.
- 20క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
- 21ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
- 22ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
Cross references
- 1 Corinthians 3:16–17 1 కొరింథీయులకు 3:16–17మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.
- 1 Corinthians 3:9 1 కొరింథీయులకు 3:9మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.
- 2 Corinthians 6:16 2 కొరింథీయులకు 6:16దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
- Ephesians 4:13–16 ఎఫెసీయులకు 4:13–16పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.
- Hebrews 3:3–4 హెబ్రీయులకు 3:3–4ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు, ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.
- 1 Kings 6:7 1 రాజులు 6:7అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలిమొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు.
- Exodus 26:1–37 నిర్గమకాండము 26:1–37మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత. అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదాని నొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను. మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును. మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను. మరియు ఏబది యిత్తడి గుండీ లను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలు కులకు తగిలించి దాని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను. మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను. ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను. ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున, ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలు వది వెండి దిమ్మలు ఉండవలెను. పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును. పలకలు ఎనిమిది; వాటి వెండిదిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మ లుండవలెను. తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను; ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగర ములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనుపరచ బడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును. అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింప వలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.
- Psalm 93:5 కీర్తనలు 93:5నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము.
- Ezekiel 42:12 యెహెజ్కేలు 42:12మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదులయొక్క తలుపులవలె వీటికి తలుపులుండెను, ఆ మార్గము ఆవరణములోనికి పోవు నొకనికి తూర్పుగా నున్న గోడ యెదుటనే యుండెను.
- Ezekiel 40:1–42 యెహెజ్కేలు 40:1–42మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను. దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటి దొకటి నాకగు పడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను. ఆ మను ష్యుడు నాతో ఇట్లనెను నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటి నన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము. నేను చూడగా నలుదిశల మందిరముచుట్టు ప్రాకార ముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను. అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను. మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర యెడము. గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను. గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే. ఆ యా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదుమూడు మూరలును తేలెను. కావలి గదులముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరుమూరల ఎత్తుగలవి. ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువది యయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత. అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను. బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపుద్వారమువరకు ఏబదిమూరలు. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను. అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను. చఎ్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను. ఈ చప్టా గుమ్మములవరకుండి వాటి వెడల్పున సాగియుండెను. అది క్రింది చప్టా ఆయెను. క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణమువరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలాయెను. మరియు ఉత్తరపువైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదుమూరలు కనబడెను. వాటి కిటికీ లును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను. ఉత్తరద్వారమున కెదురుగా ఒకటియు, తూర్పుద్వారమున కెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరుమూరల యెడము కనబడెను. అతడు నన్ను దక్షిణపుతట్టునకు తోడుకొని పోగా దక్షిణపుతట్టున గుమ్మమొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను. మరియు వాటి కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవదియైదు మూరలు. ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్యగోడలును ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మమొకటి యుండెను, దక్షిణపు తట్టును గుమ్మమునుండి గుమ్మమువరకు ఆయన కొలువగా నూరు మూరలాయెను. అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే. మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను. తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను. దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు. దాని మధ్యగోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకార ముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలువగా అదే కొలత యాయెను. దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కీటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు. దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; ఆ స్తంభములమీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను. గుమ్మముల స్తంభములయొద్ద వాకిలిగల గదియుండెను; అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు. మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలుంచబడెను; వీటిమీద దహనబలి పశువులును పాప పరిహారార్థ బలిపశువులును అపరాధపరిహారార్థ బలిపశు వులును వధింపబడును. గుమ్మముయొక్క వాకిలిదగ్గర ఉత్తరపుదిక్కున మెట్లు ఎక్కుచోటున ఇరుప్రక్కల రెండేసి బల్లలుండెను. అనగా గుమ్మపు రెండుప్రక్కల నాలుగేసి బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి యుండెను. దహనబలి పశువులు మొదలగు బలిపశువులను వధించుటకై వినియోగించు ఉపకరణము లుంచదగిన యెనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్లదగ్గర నుండెను. అవి మూరెడున్నర నిడివియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడి యుండెను.