Esther · chapter 2 · verse 23
Esther 2:23 in Telugu
ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడెను.
Ee sangatinigoorchi vichaaranakaagaa adi nijamaayenu. Anducheta vaariddarunu oka chettuku uri teeyimpabadiri. Idi raaju edutane raajyasamaachaara granthamandu vraayabadenu.
Esther 2:23 in English
- King James Version (KJV)
- And when inquisition was made of the matter, it was found out; therefore they were both hanged on a tree: and it was written in the book of the chronicles before the king.
- World English Bible (WEB)
- When this matter was investigated, and it was found to be so, they were both hanged on a gallows; and it was written in the book of the chronicles in the king’s presence.
- American Standard Version (ASV)
- And when inquisition was made of the matter, and it was found to be so, they were both hanged on a tree: and it was written in the book of the chronicles before the king.
- Bible in Basic English (BBE)
- And when the thing had been looked into, it was seen to be true, and the two of them were put to death by hanging on a tree: and it was put down in the records before the king.
- Darby Translation (DBY)
- And the matter was investigated and found out; and they were both hanged on a tree. And it was written in the book of the chronicles before the king.
- Webster's Bible (WBS)
- And when inquisition was made of the matter, it was discovered; therefore they were both hanged on a tree: and it was written in the book of the chronicles before the king.
- Young's Literal Translation (YLT)
- and the thing is sought out, and found, and they are hanged both of them on a tree, and it is written in the book of the Chronicles before the king.
Read in context
- 21ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని యుండిరి.
- 22ఈ సంగతి మొర్దెకైకి తెలియబడి నందున అతడు దానిని రాణియైన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకైయొక్క పేరట రాజునకు దాని తెలియ జేసెను.
- 23ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడెను.
Cross references
- Genesis 40:19 ఆదికాండము 40:19ఇంక మూడు దినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీమీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.
- Esther 10:2 ఎస్తేరు 10:2మొర్దెకై యొక్క బలమును గూర్చియు, అతడు సామర్థ్యముచేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని ఘన పరచిన సంగతిని గూర్చియు మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడియున్నది.
- Genesis 40:22 ఆదికాండము 40:22మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.
- Deuteronomy 21:22–23 ద్వితీయోపదేశకాండము 21:22–23మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.
- Esther 7:10 ఎస్తేరు 7:10కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.
- Malachi 3:16 మలాకీ 3:16అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.
- Joshua 8:29 యెహోషువ 8:29యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.